Telugu Global
Cinema & Entertainment

బాలయ్య వచ్చినా, రాకపోయినా.... కల్యాణ్ రామ్ రావడం గ్యారెంటీ

హరికృష్ణ మరణంతో నందమూరి కుటుంబం మొత్తం ఒక్కటైందంటూ వార్తలు వచ్చాయి. బాలకృష్ణ, ఎన్టీఆర్ పూర్తిగా కలిసిపోయారని, ఆ టైమ్ లో దాదాపు వారం రోజులు వీళ్లిద్దరు కలిసే ఉన్నారంటూ వార్తలు వచ్చాయి. వాటికి సంబంధించిన కొన్ని స్టిల్స్ కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఈ నేపథ్యంలో త్వరలోనే జరగనున్న అరవింద సమేత ప్రీ-రిలీజ్ ఫంక్షన్ కు బాలకృష్ణ రాబోతున్నాడంటూ కథనాలు వచ్చాయి. సినిమా యూనిట్ కూడా ఈ విషయాన్ని ఆఫ్ ది రికార్డు ఒప్పుకుంది. కానీ […]

బాలయ్య వచ్చినా, రాకపోయినా.... కల్యాణ్ రామ్ రావడం గ్యారెంటీ
X

హరికృష్ణ మరణంతో నందమూరి కుటుంబం మొత్తం ఒక్కటైందంటూ వార్తలు వచ్చాయి. బాలకృష్ణ, ఎన్టీఆర్ పూర్తిగా కలిసిపోయారని, ఆ టైమ్ లో దాదాపు వారం రోజులు వీళ్లిద్దరు కలిసే ఉన్నారంటూ వార్తలు వచ్చాయి. వాటికి సంబంధించిన కొన్ని స్టిల్స్ కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఈ నేపథ్యంలో త్వరలోనే జరగనున్న అరవింద సమేత ప్రీ-రిలీజ్ ఫంక్షన్ కు బాలకృష్ణ రాబోతున్నాడంటూ కథనాలు వచ్చాయి. సినిమా యూనిట్ కూడా ఈ విషయాన్ని ఆఫ్ ది రికార్డు ఒప్పుకుంది. కానీ ఇప్పుడీ మేటర్ పై ఇంకా సందిగ్దం కొనసాగుతోంది.

అక్టోబర్ 2న (మరో 3 రోజుల్లో) అరవింద సమేత ప్రీ-రిలీజ్ ఫంక్షన్ హైదరాబాద్ లో జరగనుంది. దీనికి సంబంధించి ఇప్పటికే భారీ ఏర్పాట్లు సాగుతున్నాయి. భరత్ అనే నేను, రంగస్థలం స్థాయిలో గ్రాండ్ గా ప్రీ-రిలీజ్ ఫంక్షన్ చేయాలని నిర్ణయించారు. అయితే బాలకృష్ణ నుంచి మాత్రం ఇంకా ఎలాంటి గ్రీన్ సిగ్నల్ రాలేదని తెలుస్తోంది.

ప్రస్తుతం ఎన్టీఆర్ బయోపిక్ లో బిజీగా ఉన్నారు బాలయ్య. ఈ సినిమాకు సంబంధించి సోమవారం నుంచి శ్రీకాకుళంలో ఓ షెడ్యూల్ అనుకుంటున్నారు. పెద్ద ఎన్టీఆర్ తన చైతన్య రథంలో యాత్రను శ్రీకాకుళం నుంచే ప్రారంభించారు. దీనికి సంబంధించిన సన్నివేశాల్ని అక్కడే తీయాలని నిర్ణయించారు.

సోమవారం నుంచి షెడ్యూల్ ప్రారంభమైతే, అరవింద సమేత ప్రీ-రిలీజ్ ఫంక్షన్ కు బాలయ్య రావడం కష్టం అవుతుంది. అదే ఇప్పుడు అరవింద యూనిట్ అందరిలో ఉన్న అనుమానం. బాలయ్య వచ్చినా, రాకపోయినా ఈ ప్రీ-రిలీజ్ ఫంక్షన్ కు కల్యాణ్ రామ్ రావడం మాత్రం గ్యారెంటీ. బాలయ్య వస్తారా, రారా అనేది ఈరోజు, రేపట్లో తేలనుంది.

First Published:  29 Sep 2018 5:32 AM GMT
Next Story