Telugu Global
Cinema & Entertainment

రాజశేఖర్ కూతురితో ఆనంద్ దేవరకొండ సినిమా

తెలుగు సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ ప్రస్తుతం స్టార్ స్టేటస్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ హీరో ఇప్పుడు తన తమ్ముడిని కూడా హీరోగా పరిచయం చెయ్యాలి అని ఫిక్స్ అయ్యాడు. విజయ్ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా పరిచయమవుతున్న సినిమా ద్వారా జీవిత-రాజశేఖర్ చిన్న కూతురు శివాత్మిక కూడా హీరోయిన్ గా పరిచయం కాబోతుంది. ఈ సినిమాకి “దొరసాని” అనే టైటిల్ ని పెట్టారు మూవీ యూనిట్. తెలంగాణ విలేజ్ ప్రాంతానికి చెందిన కథతో ఈ […]

రాజశేఖర్ కూతురితో ఆనంద్ దేవరకొండ సినిమా
X

తెలుగు సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ ప్రస్తుతం స్టార్ స్టేటస్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ హీరో ఇప్పుడు తన తమ్ముడిని కూడా హీరోగా పరిచయం చెయ్యాలి అని ఫిక్స్ అయ్యాడు.

విజయ్ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా పరిచయమవుతున్న సినిమా ద్వారా జీవిత-రాజశేఖర్ చిన్న కూతురు శివాత్మిక కూడా హీరోయిన్ గా పరిచయం కాబోతుంది. ఈ సినిమాకి “దొరసాని” అనే టైటిల్ ని పెట్టారు మూవీ యూనిట్.

తెలంగాణ విలేజ్ ప్రాంతానికి చెందిన కథతో ఈ సినిమా సాగుతుందని, షార్ట్ ఫిల్మ్ మేకర్ కే.వి.ఆర్ మహేంద్ర దర్శకత్వం వహిస్తాడని తెలుస్తుంది.

అక్టోబర్ 10న ఈ సినిమాని గ్రాండ్ గా పూజ కార్యక్రమాలతో లాంచ్ చేయాలి అని విజయ్ అనుకుంటున్నాడు. ఇదిలా ఉంటే ఆనంద్ దేవరకొండ, శివాత్మిక కొన్ని రోజులుగా యాక్టింగ్ వర్క్ షాపులో పాల్గొంటూ సినిమా కథకు తగిన విధంగా తెలంగాణ స్లాంగ్, ఇతర అంశాలపై శిక్షణ తీసుకుంటున్నారని తెలుస్తుంది.

యష్ రంగినేని, మధుర శ్రీధర్ ఈ సినిమాని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మరి ఆనంద్ దేవరకొండ విజయ్ లాగ తనకంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకుంటాడో లేదో చూడాలి.

First Published:  28 Sep 2018 5:06 AM GMT
Next Story