Telugu Global
Cinema & Entertainment

పాజిటివ్ టాక్ వచ్చింది.... అయినా శాటిలైట్ మాత్రం కావట్లేదు

ఫస్ట్ టైం నిర్మాతగా మారాడు. ఓ కొత్త దర్శకుడ్ని పరిచయం చేశాడు. ఓ కొత్తమ్మాయిని కూడా టాలీవుడ్ కు పరిచయం చేశాడు. సెటప్ అంతా బాగానే పెట్టుకున్నాడు. సినిమాకు కూడా ఓ మోస్తరు టాక్ వచ్చింది. కానీ శాటిలైట్ రైట్స్ విషయంలో మాత్రం సక్సెస్ కాలేకపోతున్నాడు హీరో కమ్ ప్రొడ్యూసర్ సుధీర్ బాబు. ఇతడు తీసిన నన్ను దోచుకుందువటే సినిమా మార్కెట్లో బాగానే రన్ అవుతోంది. ఓ మోస్తరు టాక్ తో, మోస్తరు వసూళ్లతో బాగానే నడుస్తోంది. […]

పాజిటివ్ టాక్ వచ్చింది.... అయినా శాటిలైట్ మాత్రం కావట్లేదు
X

ఫస్ట్ టైం నిర్మాతగా మారాడు. ఓ కొత్త దర్శకుడ్ని పరిచయం చేశాడు. ఓ కొత్తమ్మాయిని కూడా టాలీవుడ్ కు పరిచయం చేశాడు. సెటప్ అంతా బాగానే పెట్టుకున్నాడు. సినిమాకు కూడా ఓ మోస్తరు టాక్ వచ్చింది. కానీ శాటిలైట్ రైట్స్ విషయంలో మాత్రం సక్సెస్ కాలేకపోతున్నాడు హీరో కమ్ ప్రొడ్యూసర్ సుధీర్ బాబు.

ఇతడు తీసిన నన్ను దోచుకుందువటే సినిమా మార్కెట్లో బాగానే రన్ అవుతోంది. ఓ మోస్తరు టాక్ తో, మోస్తరు వసూళ్లతో బాగానే నడుస్తోంది. కానీ శాటిలైట్ మార్కెట్ దగ్గరకొచ్చేసరికి మాత్రం ఈ సినిమా ఫెయిల్ అయింది.

కాస్త బజ్ ఉన్న సినిమాను విడుదలకు ముందే ఎగరేసుకుపోతుంటాయి ఎంటర్ టైన్ మెంట్ ఛానెళ్లు. అలాంటిది కాస్తోకూస్తో పాజిటివ్ టాక్ వచ్చిన తర్వాత కూడా సుధీర్ బాబు సినిమాను కొనేందుకు టీవీ ఛానెళ్లు ఇంట్రెస్ట్ చూపించడం లేదు. దీనికి ప్రధానంగా రెండు కారణాలున్నాయి.

వీటిలో ఒకటి శాటిలైట్ రైట్స్ కింద సుధీర్ బాబు మరీ ఎక్కువ మొత్తం చెబుతున్నాడట. దాదాపు ప్రొడక్షన్ కాస్ట్ ను శాటిలైట్ కింద లాగేయాలని చూస్తున్నాడట. అయినప్పటికీ ఛానెల్స్ కు అది పెద్ద సమస్య కాదు. ఎటొచ్చి సుధీర్ బాబు సినిమాలకు బుల్లితెరలో పెద్దగా మార్కెట్ లేదు. అతడి సినిమాలకు టీఆర్పీలు రావు. నన్ను దోచుకుందువటే సినిమా ఇప్పటివరకు అమ్ముడుపోకపోవడానికి ప్రధాన కారణం ఇదే.

First Published:  28 Sep 2018 12:38 AM GMT
Next Story