Telugu Global
Cinema & Entertainment

పెళ్ళైన తరువాత ఎలా ఉండాలో చెప్పడానికి మీరెవరు? " సమంత

అక్కినేని సమంతా… నాగ చైతన్యతో పెళ్లి అయిన తరువాత కూడా వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. ఇప్పటికే ఈ ఏడాది నాలుగు హిట్స్ అందుకున్న ఈ భామ… సినిమాల షూటింగ్ లనుంచి దూరంగా భర్త తో కలిసి ఫారిన్ ట్రిప్ కి వెళ్ళింది. A Biggg Salute to u @Samanthaprabhu2 ???? pic.twitter.com/8GURJ3K48o — Just GK™ (@IamMegaKriSH) September 27, 2018 అయితే అక్కడ తన భర్త నాగ చైతన్యతో కలిసి ఎంజాయ్ చేస్తున్న […]

పెళ్ళైన తరువాత ఎలా ఉండాలో చెప్పడానికి మీరెవరు?  సమంత
X

అక్కినేని సమంతా… నాగ చైతన్యతో పెళ్లి అయిన తరువాత కూడా వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. ఇప్పటికే ఈ ఏడాది నాలుగు హిట్స్ అందుకున్న ఈ భామ… సినిమాల షూటింగ్ లనుంచి దూరంగా భర్త తో కలిసి ఫారిన్ ట్రిప్ కి వెళ్ళింది.

అయితే అక్కడ తన భర్త నాగ చైతన్యతో కలిసి ఎంజాయ్ చేస్తున్న ఫొటోలని విచ్చలవిడిగా తన సోషల్ మీడియా అకౌంట్స్ లో పోస్ట్ చేసింది సమంత. అలాగే అక్కడ సమంతా బికినీ వేసుకుంది. ఆ ఫొటోని కూడా సమంత తన సోషల్ మీడియా లో పెట్టుకుంది.

View this post on Instagram

Inner peace ?

A post shared by Samantha Akkineni (@samantharuthprabhuoffl) on

అయితే ఇప్పుడే అసలు సమస్య వచ్చి పడింది. ఆ ఫొటోని చూసిన అక్కినేని అభిమానులు, సమంత అభిమానులు సమంత ని ఒక రేంజ్ లో ట్రోల్ చేశారు. పెళ్లి అయ్యాక కూడా ఇలాంటి డ్రెస్ లు వేసుకోవడం ఏంటి? సరే వేసుకుంటే వేసుకున్నావు మళ్ళీ ఎందుకు అది అందరికి చూపించడం? ఇప్పుడు నువ్వు మామూలు వ్యక్తివి కాదు అక్కినేని ఇంటి కోడలివి కొంచెం జాగ్రత్తగా ఉండు అంటూ కామెంట్స్ పోస్ట్ చేసారు.

ఈ కామెంట్స్ కి హర్ట్ అయిన సమంత “పెళ్ళి తరువాత కూడా ఎలా ఉండాలో చెప్పడానికి మీరెవరు? నా ఇష్టం వచ్చినట్టు నేనుంటాను” అని చెప్పి మిడిల్ ఫింగర్ ఫొటో ని పోస్ట్ చేసింది సమంత. మొత్తానికి సమంతకి, అక్కినేని ఫ్యాన్స్ కి మధ్య సోషల్ మీడియా వార్ ఇంకా ముదిరేలాగే కనపడుతోంది.

First Published:  28 Sep 2018 1:14 AM GMT
Next Story