Telugu Global
NEWS

కంభంపాటి కుమారుడు వచ్చి బతిమలాడారు " పవన్ కల్యాణ్

తనను హత్య చేసేందుకు కుట్ర జరిగిందంటున్నారు జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌. 2019 ఎన్నికల్లో తాను పోటీ చేయకుండా అడ్డుతొలగించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఏలూరులో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించిన పవన్‌ కల్యాణ్… అధికార టీడీపీ ఎమ్మెల్యేలు రాష్ట్రాన్ని బీహార్‌, యూపీలా మార్చే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. తనను హత్య చేసేందుకు కూడా ప్రయత్నిస్తున్నారని చెప్పారు. తనను హత్య చేయడంపై మాట్లాడుకున్న ఫోన్‌ సంభాషణ కూడా తాను విన్నానని పవన్‌ కల్యాణ్ చెప్పారు. ఆ వ్యక్తులు ఎవరన్నది […]

కంభంపాటి కుమారుడు వచ్చి బతిమలాడారు  పవన్ కల్యాణ్
X

తనను హత్య చేసేందుకు కుట్ర జరిగిందంటున్నారు జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌. 2019 ఎన్నికల్లో తాను పోటీ చేయకుండా అడ్డుతొలగించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఏలూరులో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించిన పవన్‌ కల్యాణ్… అధికార టీడీపీ ఎమ్మెల్యేలు రాష్ట్రాన్ని బీహార్‌, యూపీలా మార్చే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.

తనను హత్య చేసేందుకు కూడా ప్రయత్నిస్తున్నారని చెప్పారు. తనను హత్య చేయడంపై మాట్లాడుకున్న ఫోన్‌ సంభాషణ కూడా తాను విన్నానని పవన్‌ కల్యాణ్ చెప్పారు. ఆ వ్యక్తులు ఎవరన్నది కూడా తనకు తెలుసన్నారు. ‘పవన్‌ కల్యాణ్‌ను చంపితే ఏమవుతుంది. మహా అయితే ఓ నెల రోజులు గొడవలు అవుతాయని ముగ్గురు వ్యక్తులు మాట్లాడుకుంటున్నారు. వాళ్లు ఏ పార్టీ వారో, ఆ వ్యక్తుల పేర్లు తెలుసు, వారి ముఖాలు కూడా నాకు తెలుసు’ అని అన్నారు.

2014లో టీడీపీ నేత కంభంపాటి రామ్మోహన్‌రావు కుమారుడు తన వద్దకు వచ్చి టీడీపీకి మద్దతు ఇవ్వకపోతే వైసీపీ గెలుస్తుందని అప్పుడు తాము వ్యాపారాలు కూడా చేసుకోలేమని బతిమలాడారని పవన్‌ చెప్పారు. దాంతో తాను టీడీపీకి మద్దతు ఇచ్చానన్నారు. టీడీపీకి తాను మద్దతు ఇచ్చాను కాబట్టే రెండు శాతం ఓట్ల తేడాతో జగన్ ఓడిపోయారని.. లేకుంటే మంచి మెజారిటీతో సీఎం అయ్యేవారని పవన్‌కల్యాణ్ చెప్పారు.

First Published:  27 Sep 2018 9:34 PM GMT
Next Story