Telugu Global
International

ఆసియాకప్ లో నేడు టైటిల్ ఫైట్

దుబాయ్ వేదికగా టీమిండియాకు బంగ్లాదేశ్ సవాల్ ఏడో ఆసియాకప్ కు టీమిండియా గురి సూపర్ ఫోర్ లో బంగ్లా, పాక్ ల పై టీమిండియా గెలుపు ఫైనల్లో హాట్ ఫేవరెట్ గా టీమిండియా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా…గత రెండువారాలుగా జరుగుతున్న ఆసియాకప్ సమరం క్లైయ్ మాక్స్ దశకు చేరింది. బంగ్లాదేశ్ తో జరిగే టైటిల్ ఫైట్ లో డిఫెండింగ్ చాంపియన్ టీమిండియా హాట్ ఫేవరెట్ గా పోటీకి దిగుతోంది. మూడున్నర దశాబ్దాల ఆసియాకప్ లో టీమిండియా రికార్డులు […]

ఆసియాకప్ లో నేడు టైటిల్ ఫైట్
X
  • దుబాయ్ వేదికగా టీమిండియాకు బంగ్లాదేశ్ సవాల్
  • ఏడో ఆసియాకప్ కు టీమిండియా గురి
  • సూపర్ ఫోర్ లో బంగ్లా, పాక్ ల పై టీమిండియా గెలుపు
  • ఫైనల్లో హాట్ ఫేవరెట్ గా టీమిండియా

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా…గత రెండువారాలుగా జరుగుతున్న ఆసియాకప్ సమరం క్లైయ్ మాక్స్ దశకు చేరింది. బంగ్లాదేశ్ తో జరిగే టైటిల్ ఫైట్ లో డిఫెండింగ్ చాంపియన్ టీమిండియా హాట్ ఫేవరెట్ గా పోటీకి దిగుతోంది. మూడున్నర దశాబ్దాల ఆసియాకప్ లో టీమిండియా రికార్డులు ఓసారి చూద్దాం.

గల్ఫ్ దేశం…యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా జరుగుతున్న…. 2018 ఆసియాకప్ క్రికెట్ సమరం ముగింపు దశకు చేరింది. ఆరుసార్లు చాంపియన్ టీమిండియా, బంగ్లాదేశ్ జట్లు ఫైనల్స్ చేరడంతో…. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా టైటిల్ సమరానికి రంగం సిద్ధమయ్యింది.

ఆసియాకప్ కింగ్ టీమిండియా….

డిఫెండింగ్ చాంపియన్ టీమిండియా….అలవోకగా ఫైనల్స్ చేరడం ద్వారా….ఏడో టైటిల్ కు గురిపెట్టింది. 1984 లో ..యూఏఈ వేదికగానే శ్రీకారం చుట్టుకొన్న ఆసియాకప్…గత 36 సంవత్సరాల కాలంలో అంతైఇంతై అన్నట్లుగా ఎదిగిపోయింది.

ఆసియాక్రికెట్ కౌన్సిల్ ఆధ్వర్యంలో జరిగే ఈటోర్నీ… మూడున్నర దశాబ్దాల చరిత్రలో అత్యధికంగా… ఆరుసార్లు విజేతగా నిలిచిన ఏకైకజట్టు భారత్ మాత్రమే.

ఇప్పటికే రెండుసార్లు ప్రపంచ విజేతగా ఉన్న భారతజట్టు 1984 ప్రారంభ ఆసియాకప్ నుంచి….2016లో ముగిసిన 13వ ఆసియాకప్ వరకూ ఆరుసార్లు ట్రోఫీ అందుకొంటే… ఐదు టైటిల్స్ తో శ్రీలంక రెండవ స్థానంలో, రెండు ఆసియాకప్ ట్రోఫీలతో పాకిస్థాన్ మూడువస్థానంలో నిలిచాయి.

ఏడో టైటిల్ కు టీమిండియా రెడీ

భారతజట్టు..1984, 1988, 1990, 1995, 2008, 2016 సంవత్సరాలలో ఆసియాకప్ విజేతగా నిలిచింది. యూఏఈ వేదికగా జరుగుతున్న ప్రస్తుత టోర్నీలో సైతం… ఆరుజట్ల గ్రూప్ లీగ్ దశలో…. పసికూన హాంకాంగ్ ను అతికష్టం మీద అధిగమించిన టీమిండియా…చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ ను మాత్రం 8 వికెట్ల తేడాతో చిత్తు చేసి…. గ్రూప్ టాపర్ గా సూపర్ ఫోర్ రౌండ్ లో అడుగుపెట్టింది.

తిరుగులేని టీమిండియా

అంతేకాదు…నాలుగుజట్ల సూపర్ ఫోర్ రౌండ్లో సైతం టీమిండియా అజేయంగా నిలిచింది. బంగ్లాదేశ్, పాకిస్థాన్ జట్లను అలవోకగా ఓడించిన టీమిండియా కు… ఆఖరి రౌండ్ పోటీలో మాత్రం… 10వ ర్యాంకర్ అఫ్ఘనిస్థాన్ నుంచి గట్టి పోటీ ఎదురయ్యింది. చివరకు మ్యాచ్ ను టై తో సరిపెట్టుకోక తప్పలేదు. సూపర్ ఫోర్ రౌండ్ నంబర్ వన్ జట్టుగా టీమిండియా ఫైనల్స్ బెర్త్ ఖాయం చేసుకొంది.

సమతూకంతో రోహిత్ సేన

సూపర్ ఓపెనర్ రోహిత్ శర్మ నాయకత్వంలోని టీమిండియా… వన్డే క్రికెట్ రెండో ర్యాంకర్ మాత్రమే కాదు… ప్రస్తుత ఆసియాకప్ లో అత్యంత సమతూకంతో కూడిన జట్టుగా కనిపిస్తోంది.

మరోవైపు… పడిలేస్తూ ఫైనల్స్ చేరిన బంగ్లాదేశ్ జట్టు… ఫైనల్లో టీమిండియాకు గట్టి పోటీ ఇచ్చే అవకాశాలున్నాయి. ముష్రఫే మొర్తాజా నాయకత్వంలోని బంగ్లాజట్టు… ఫైనల్లో సైతం స్థాయికి తగ్గట్టుగా ఆడితే… పోటీ ఉత్కంఠభరితంగా జరగడం ఖాయమని చెప్పాల్సిన పనిలేదు.

First Published:  28 Sep 2018 2:10 AM GMT
Next Story