Telugu Global
Cinema & Entertainment

జాహ్నవి సరసన హీరోగా విజయ్ దేవరకొండ

అలనాటి మేటి నటి అయిన శ్రీ దేవి ఈ ఏడాది మరణించిన విషయం మనందరికీ తెలిసిందే. ఆమె పెద్ద కూతురు జాహ్నవి తెలుగు ఎంట్రీ గురించి ఎంతో మంది తెలుగు ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. కానీ జాహ్నవి ఇప్పటి వరకు హిందీ సినిమాలు మాత్రమే ఓకే చేసింది. మరాఠీ సినిమా “సైరత్‌”కి హిందీ రీమేక్‌గా తెరకెక్కిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసల్ని అందుకోవడంతో పాటు, బాక్సాఫీస్‌ వద్ద 100 కోట్ల వసూళ్లు రాబట్టింది జాహ్నవి కపూర్ నటించిన […]

జాహ్నవి సరసన హీరోగా విజయ్ దేవరకొండ
X

అలనాటి మేటి నటి అయిన శ్రీ దేవి ఈ ఏడాది మరణించిన విషయం మనందరికీ తెలిసిందే. ఆమె పెద్ద కూతురు జాహ్నవి తెలుగు ఎంట్రీ గురించి ఎంతో మంది తెలుగు ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. కానీ జాహ్నవి ఇప్పటి వరకు హిందీ సినిమాలు మాత్రమే ఓకే చేసింది. మరాఠీ సినిమా “సైరత్‌”కి హిందీ రీమేక్‌గా తెరకెక్కిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసల్ని అందుకోవడంతో పాటు, బాక్సాఫీస్‌ వద్ద 100 కోట్ల వసూళ్లు రాబట్టింది జాహ్నవి కపూర్ నటించిన “ధడక్‌” మూవీ.

తొలి సినిమాకే ఈ స్థాయిలో పర్‌ఫామెన్స్‌తో, అందంతో ఆకట్టుకున్న జాన్వీ కపూర్‌ ప్రస్తుతం “తఖ్త్‌” అనే ఓ పీరియాడిక్‌ మూవీలో నటిస్తోంది. ధర్మ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌లో కరణ్‌ జోహార్‌ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ సినిమా తరువాత వెంటనే తెలుగు ఒక సినిమా చేస్తుంది అంట జాహ్నవి కపూర్. ఈ సినిమాలో తెలుగు సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తాడు అంట. మొదట జాహ్నవి కపూర్ తెలుగు లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమాతో ఎంట్రీ ఇస్తుంది అని అనుకున్నారు, కానీ ఇప్పుడు ఈ భామ విజయ్ దేవరకొండ సరసన నటిస్తుంది. ఇంకా ఈ విషయం పై బోని కపూర్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

First Published:  27 Sep 2018 4:59 AM GMT
Next Story