Telugu Global
Cinema & Entertainment

తమిళ్ మల్టీ స్టారర్ లో విజయ్ దేవరకొండ

తమిళ్ హీరో సూర్య కి తెలుగు లో కూడా మంచి మార్కెట్ ఉంది. సూర్య ఎప్పటి నుంచో తెలుగు లో ఒక హీరో తో మల్టీ స్టారర్ లో నటించాలని అనుకుంటున్నాడు. అయితే ఇప్పుడు ఆ అవకాశం విజయ్ దేవరకొండ ని వరించింది. సౌత్ స్టార్ సూర్య, టాలీవుడ్ సంచలనం విజయ్ దేవరకొండ కాంబినేషన్లో సినిమా రాబోతుంది. “గురు” ఫేం సుధా కొంగర ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నట్లు సమాచారం. ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా మొదలైనట్లు […]

తమిళ్ మల్టీ స్టారర్ లో విజయ్ దేవరకొండ
X

తమిళ్ హీరో సూర్య కి తెలుగు లో కూడా మంచి మార్కెట్ ఉంది. సూర్య ఎప్పటి నుంచో తెలుగు లో ఒక హీరో తో మల్టీ స్టారర్ లో నటించాలని అనుకుంటున్నాడు. అయితే ఇప్పుడు ఆ అవకాశం విజయ్ దేవరకొండ ని వరించింది. సౌత్ స్టార్ సూర్య, టాలీవుడ్ సంచలనం విజయ్ దేవరకొండ కాంబినేషన్లో సినిమా రాబోతుంది. “గురు” ఫేం సుధా కొంగర ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నట్లు సమాచారం.

ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా మొదలైనట్లు ప్రచారం జరుగుతోంది. సూర్య త్వరలో తన కజిన్ కె.ఇ.జ్ఞానవేల్ రాజాకు చెందిన స్టూడియో గ్రీన్ పతాకంపై ఈ సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నాడట. 2019 లో స్టార్ట్ అయ్యే ఈ సినిమా పై అందరిలోనూ భారీ అంచనాలు ఉన్నాయి. సంతోష్ నారాయణ్ ఈ సినిమాకి సంగీతం అందించనున్నాడు.

ఇదిలా ఉంటే ప్రస్తుతం విజయ్ దేవరకొండ స్టూడియో గ్రీన్ వాళ్ళ బ్యానర్ లోనే “నోటా” అనే సినిమా చేస్తున్నాడు. ఆనంద్ శంకర్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా అక్టోబర్ 5 న గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది.

First Published:  26 Sep 2018 10:12 PM GMT
Next Story