Telugu Global
NEWS

ఇవి ఓటుకు నోటు దాడులే.... నాకేం సంబంధం లేదు " సెబాస్టియన్

ఓటుకు నోటు వ్యవహారం మళ్లీ తెరపైకి వచ్చింది. ఓటుకు నోటు కేసులో నిందితులుగా ఉన్న వారి ఇళ్లలో ఐటీ దాడులు నిర్వహించింది. నిందితుల ఇళ్లలోకి తలుపులు బలవంతంగా తెరిచి మరీ అధికారులు ఎంటర్‌ అయ్యారు. రేవంత్ రెడ్డితో పాటు ఓటుకు నోటు కేసులో ఏ-2గా ఉన్న సెబాస్టియన్ ఇంటిపైనా దాడులు జరిగాయి. బంజారాహిల్స్‌ రోడ్డు నెంబర్‌ 45లో ఉన్న భోపాల్ ఇన్‌ఫ్రా ఆఫీస్‌లోనూ తనిఖీలు నిర్వహించారు. ఓటుకు నోటు కేసులో ఉన్నందునే తనపై ఐటీ దాడులు జరుగుతున్నాయని […]

ఇవి ఓటుకు నోటు దాడులే.... నాకేం సంబంధం లేదు  సెబాస్టియన్
X

ఓటుకు నోటు వ్యవహారం మళ్లీ తెరపైకి వచ్చింది. ఓటుకు నోటు కేసులో నిందితులుగా ఉన్న వారి ఇళ్లలో ఐటీ దాడులు నిర్వహించింది. నిందితుల ఇళ్లలోకి తలుపులు బలవంతంగా తెరిచి మరీ అధికారులు ఎంటర్‌ అయ్యారు.

రేవంత్ రెడ్డితో పాటు ఓటుకు నోటు కేసులో ఏ-2గా ఉన్న సెబాస్టియన్ ఇంటిపైనా దాడులు జరిగాయి. బంజారాహిల్స్‌ రోడ్డు నెంబర్‌ 45లో ఉన్న భోపాల్ ఇన్‌ఫ్రా ఆఫీస్‌లోనూ తనిఖీలు నిర్వహించారు. ఓటుకు నోటు కేసులో ఉన్నందునే తనపై ఐటీ దాడులు జరుగుతున్నాయని సెబాస్టియన్ చెప్పారు.

రేవంత్ రెడ్డితో తనకు ఎలాంటి వ్యాపార సంబంధాలు లేవన్నారు. తన కంపెనీ క్రమం తప్పకుండా ఐటీ పన్నులు చెల్లిస్తోందని…. అయినా సరే దాడులు చేస్తున్నారని…. ఇది ఓటుకు నోటు కేసుకు సంబంధించిన దాడులేనని సెబాస్టియన్ చెప్పారు. ప్రభుత్వం ఇలా చేయడం సరైనది కాదన్నారు.

First Published:  27 Sep 2018 3:40 AM GMT
Next Story