Telugu Global
Cinema & Entertainment

"ఎన్టీఆర్" బయోపిక్ లో నటిస్తున్న డైరెక్టర్ శంకర్

క్రిష్ దర్శకత్వం లో నందమూరి బాలకృష్ణ హీరో గా సీనియర్ ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా “ఎన్టీఆర్” బయోపిక్ రూపొందుతున్న సంగతి అందరికి తెలిసిందే. క్రిష్ ఈ సినిమా యొక్క షూటింగ్ ని శర వేగంగా పూర్తీ చేస్తున్నాడు. ఎందుకంటే వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా ని రిలీజ్ చేయబోతున్నాడు బాలకృష్ణ. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా లో విఠలాచార్య పాత్రలో దర్శకుడు ఎన్ .శంకర్ నటించబోతున్నాడు అనే వార్తలు వినిపిస్తున్నాయి. “జయం మనదేరా” […]

ఎన్టీఆర్ బయోపిక్ లో నటిస్తున్న డైరెక్టర్ శంకర్
X

క్రిష్ దర్శకత్వం లో నందమూరి బాలకృష్ణ హీరో గా సీనియర్ ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా “ఎన్టీఆర్” బయోపిక్ రూపొందుతున్న సంగతి అందరికి తెలిసిందే. క్రిష్ ఈ సినిమా యొక్క షూటింగ్ ని శర వేగంగా పూర్తీ చేస్తున్నాడు. ఎందుకంటే వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా ని రిలీజ్ చేయబోతున్నాడు బాలకృష్ణ. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా లో విఠలాచార్య పాత్రలో దర్శకుడు ఎన్ .శంకర్ నటించబోతున్నాడు అనే వార్తలు వినిపిస్తున్నాయి.

“జయం మనదేరా” “జై బోలో తెలంగాణా” వంటి సినిమాలతో ఆకట్టుకున్న శంకర్ ఈ సినిమాతో నటుడిగా కూడా మారబోతున్నాడు. శంకర్ కి త్వరలో మేక్ అప్ టెస్ట్ కూడా చేయనున్నారు మూవీ యూనిట్. ఈ సినిమాలో చంద్రబాబు నాయుడు పాత్రలో రానా దగ్గుబాటి అలాగే ఏఎన్ఆర్ పాత్రలో సుమంత్ కనిపించబోతున్నారు. బాలీవుడ్ హీరోయిన్ విద్య బాలన్ ఎన్టీఆర్ భార్య బసవతరకంగా కనిపించబోతుంది. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాని వారాహి చాలని చిత్రం పై సాయి కొర్రపాటి అలాగే ఎన్.బి.కే ఫిలిమ్స్ పై బాలకృష్ణ నిర్మిస్తున్నారు.

First Published:  26 Sep 2018 9:02 PM GMT
Next Story