Telugu Global
NEWS

కిడారి హత్య.... చంద్రబాబు పాపం కాదా? నక్సల్స్ ప్రశ్న!

తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు పన్నిన విషవ్యూహం వల్లనే ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు హత్య జరిగిందని స్పష్టం అవుతోంది. ఎమ్మెల్యేను చంపిన సందర్భంలో నక్సలైట్లు వేసిన ప్రశ్నల గురించి మీడియాలో వస్తున్న కథనాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. చంపే ముందు కిడారిని నక్సలైట్లు పలు ప్రశ్నలు అడిగారని.. అందులో ముఖ్యమైనది ఫిరాయింపుకు పాల్పడి ఎంత తీసుకున్నావ్? అనే ప్రశ్న కూడా ఉందని వార్తలు వస్తున్నాయి. ‘పార్టీ మారి కోట్ల రూపాయలు తీసుకున్నావ్.. అయినా చాల్లేదా? మళ్లీ […]

కిడారి హత్య.... చంద్రబాబు పాపం కాదా? నక్సల్స్ ప్రశ్న!
X

తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు పన్నిన విషవ్యూహం వల్లనే ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు హత్య జరిగిందని స్పష్టం అవుతోంది. ఎమ్మెల్యేను చంపిన సందర్భంలో నక్సలైట్లు వేసిన ప్రశ్నల గురించి మీడియాలో వస్తున్న కథనాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.

చంపే ముందు కిడారిని నక్సలైట్లు పలు ప్రశ్నలు అడిగారని.. అందులో ముఖ్యమైనది ఫిరాయింపుకు పాల్పడి ఎంత తీసుకున్నావ్? అనే ప్రశ్న కూడా ఉందని వార్తలు వస్తున్నాయి.

‘పార్టీ మారి కోట్ల రూపాయలు తీసుకున్నావ్.. అయినా చాల్లేదా? మళ్లీ బాక్సైట్ మీద ఎందుకు పడ్డావ్..’ అని కిడారిని నక్సలైట్లు ప్రశ్నించినట్టుగా వార్తా కథనాలు వస్తున్నాయి.

పార్టీ ఫిరాయింపుల విషయంలో ఎమ్మెల్యేల చొరవ ఎలా ఉన్నా చంద్రబాబు నాయుడే ఈ గేమ్ ను అమల్లో పెట్టాడనేది స్పష్టం అవుతున్న విషయమే. ఎమ్మెల్యేలను చేర్చేసుకుంటే.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలహీనం అయిపోతుందని చంద్రబాబు నాయుడు లెక్కేసుకున్నాడు.

అలా డబ్బుకు అమ్ముడుపోయే ఎమ్మెల్యేలను మాత్రమే చేర్చుకుని ఉంటే అదో లెక్క. అయితే చంద్రబాబు నాయుడు అంతకు మించి కొందరిని బలవంతంగా చేర్చుకున్నాడు. వారికి కూడా డబ్బులిచ్చాడు. ఈ వ్యవహారం సర్వత్రా చర్చనీయాంశంగానే నిలిచింది. డబ్బుకు ఆశపడి ఎమ్మెల్యేలు పార్టీలు మారారు అనే విషయాన్ని అంతా నమ్మే స్థితికి వచ్చింది.

డబ్బులు తీసుకోకుండా ఎమ్మెల్యేలు ఎవరూ పార్టీలు మారి ఉండరు.. అని కూడా అంతా అనుకుంటూ వచ్చారు.

చివరకు నక్సలైట్లు కూడా అదే అంశాన్ని ప్రస్తావించినట్టుగా తెలుస్తోంది. కోట్ల రూపాయలు తీసుకుని పార్టీ మారావు అయినా చాల్లేదా? ప్రజలు వద్దంటున్నా గనుల జోలికి ఎందుకు రావడం? అని కిడారిని నక్సలైట్లు ప్రశ్నించినట్టుగా తెలుస్తోంది. ఒక వేళ పార్టీనే మారకుండా ఉంటే… పార్టీలో పెద్దలకు ఏజెంట్‌గా మారి బాక్సైట్ గనుల తవ్వకానికి పాల్పడకుండా ఉండి ఉంటే కిడారిని నక్సలైట్లు కూడా చంపేవారు కాదని మరోసారి స్పష్టం అవుతోంది.

First Published:  26 Sep 2018 9:20 PM GMT
Next Story