Telugu Global
NEWS

పార్టీ మారినందుకు రూ.12 కోట్లు.... లైసెన్స్ లోకేష్ వల్లే " ఆఖరి క్షణాల్లో కిడారి

ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావును హత్య చేసే ముందు మావోయిస్టులు అతడిని చాలాసేపు ప్రశ్నించారు. ఏమి ప్రశ్నించారన్న దానిపై ఇప్పుడు స్పష్టత వచ్చింది. కిడారి, మాజీ ఎమ్మెల్యే సోమును ప్రశ్నించే సమయంలో కొందరు స్థానిక గిరిజనులు కూడా అక్కడే ఉండేలా మావోయిస్టులు చూసుకున్నారు. ఎమ్మెల్యే కిడారి గురించి గిరిజనులకు కూడా పూర్తి వివరాలు తెలియాలన్న ఉద్దేశంతోనే మావోయిస్టులు కొందరు గిరిజనులను కూడా పక్కనే ఉంచుకున్నట్టు చెబుతున్నారు. ఆ సమయంలో మావోయిస్టులకు, కిడారికి మధ్య జరిగిన సంభాషణలో పలు కీలక […]

పార్టీ మారినందుకు రూ.12 కోట్లు.... లైసెన్స్ లోకేష్ వల్లే  ఆఖరి క్షణాల్లో కిడారి
X

ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావును హత్య చేసే ముందు మావోయిస్టులు అతడిని చాలాసేపు ప్రశ్నించారు. ఏమి ప్రశ్నించారన్న దానిపై ఇప్పుడు స్పష్టత వచ్చింది.

కిడారి, మాజీ ఎమ్మెల్యే సోమును ప్రశ్నించే సమయంలో కొందరు స్థానిక గిరిజనులు కూడా అక్కడే ఉండేలా మావోయిస్టులు చూసుకున్నారు. ఎమ్మెల్యే కిడారి గురించి గిరిజనులకు కూడా పూర్తి వివరాలు తెలియాలన్న ఉద్దేశంతోనే మావోయిస్టులు కొందరు గిరిజనులను కూడా పక్కనే ఉంచుకున్నట్టు చెబుతున్నారు. ఆ సమయంలో మావోయిస్టులకు, కిడారికి మధ్య జరిగిన సంభాషణలో పలు కీలక విషయాలున్నాయి.

పార్టీ ఫిరాయింపుతో పాటు బాక్సైట్‌ గనుల లైసెన్స్‌ల పైన ప్రధానంగా ప్రశ్నించారు. తొలుత సమాధానం చెప్పకుండా మౌనంగా ఉన్న కిడారి… మావోయిస్టులు గట్టిగా ప్రశ్నించడంతో నిజాలన్నీ ఒప్పుకున్నారు.

తాను తప్పులు చేశానని… అందుకు క్షమాపణ కోరుతున్నానని…. తనను వదిలేస్తే మైనింగ్‌తో పాటు రాజకీయాలను కూడా వదిలేస్తానని చివరి క్షణాల్లో కిడారి సర్వేశ్వరరావు బతిమలాడుకున్నారు. పార్టీ ఫిరాయించినందుకు 12 కోట్లు ఇచ్చారని… గనుల లైసెన్స్‌లను నారా లోకేషే ఇప్పించారని కిడారి సర్వేశ్వరరావు మావోయిస్టుల వద్ద అంగీకరించారు.

పార్టీ మారినందుకు ఎన్ని కోట్లు తీసుకున్నావని ప్రశ్నించగా…. తొలుత కిడారి మౌనంగా నిలబడ్డారు. కానీ గట్టిగా ప్రశ్నించడంతో రూ.12 కోట్లు ఇచ్చారని అంగీకరించారు.

మావోయిస్టులకు, కిడారికి మధ్య జరిగిన సంభాషణ …

మావోలు: పార్టీ ఎందుకు మారావు?
కిడారి: గిరిజనుల కోటాలో మంత్రి పదవి ఇస్తామన్నారు.
మావోలు: పార్టీ మారినందుకు ఎంత డబ్బు తీసుకున్నావు?
కిడారి: 12 కోట్లు. (మొదట సమాధానం చెప్పకుండా నిలబడ్డ కిడారి.. గట్టిగా ప్రశ్నించడంతో సమాధానం)
మావోలు: వద్దని చెప్పినా మైనింగ్‌ వ్యవహారాలు కొనసాగిస్తున్నావు. లైసెన్స్‌లు ఎలా వచ్చాయి?
కిడారి: మంత్రి నారా లోకేశ్‌ ఇప్పించారు. అన్నీ ఆయనే చూసుకుంటామన్నారు.
మావోలు: అయితే, వద్దన్నా మైనింగ్‌ చేస్తావా?
కిడారి: కొన్ని తప్పులు చేశా. మైనింగ్‌ ఆపేస్తా. ఇక చేయను, ఈ మేరకు రాసిస్తా. రాజకీయాలు కూడా మానేస్తా. రెండు రోజులు సమయం ఇవ్వండి.
మావోలు: చేసిందంతా ఒక ఎత్తయితే…. ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నావు. కొత్తగా రెండు వాహనాలు కొన్నావు కదా!
కిడారి: అవును. ట్రైకార్‌ సంస్థ ద్వారా రుణం తీసుకున్నా. 35 శాతం సబ్సిడీ, ఎమ్మెల్యే అలవెన్స్‌ ఉంది.
మావోలు: అంత విలాసవంతమైన జీవితం కావాలా?
కిడారి: మౌనం.

అటు మాజీ ఎమ్మెల్యే సోము కూడా కొన్ని విషయాలు మావోయిస్టులకు చెప్పారు. కిడారి టీడీపీలో చేరడంతో ఆయనతో కలిసి తిరగాల్సిందిగా ముఖ్యమంత్రి చంద్రబాబు తనను ఆదేశించారని సోము వెల్లడించారు. కిడారికి ఉన్న గనుల్లో 25 శాతం వాటా తనకు ఇచ్చారని వివరించారు.

తానేమీ పెట్టుబడి పెట్టలేదని అంతా కిడారే చూసుకునే వారని…. తనకు గనుల్లో 25 శాతం వాటా ఇచ్చారని సోము తెలిపారు. ఇద్దరూ చెప్పిన మాటలు విన్న మావోయిస్టులు మీరు బతకడానికి వీల్లేదంటూ కాల్పులు జరిపారని ప్రత్యక్ష సాక్ష్యులు చెబుతున్నారు.

First Published:  26 Sept 2018 9:30 PM GMT
Next Story