Telugu Global
NEWS

ఎర్రబెల్లి టార్గెట్ అదే.... అందుకే వదలడం లేదట....

కేసీఆర్ పోయినసారే హామీ ఇచ్చాడట…. ఈసారి పక్కా అని…. అందుకే ప్రశ్నించిన జనాలను బతిమిలాడుతూ.. అసమ్మతిని బుజ్జగిస్తూ.. రైతులతో చెలిమిచేస్తూ.. పనివాళ్లతో పనివాడిగా మారిపోతూ ఎర్రబెల్లి దయాకర్ రావు ఇప్పుడు నియోజకవర్గంలో గెలుపు కోసం సకల కళావల్లభుడిగా మారిపోతున్నాడట. అస్సలు పని ఉంటే తప్పితే నియోజకవర్గం దాటి కాలు బయట పెట్టడం లేదట. ఇంతకీ ఎర్రబెల్లికి వచ్చిన ఆ హామీ ఏంటో తెలుసా? ఈసారి మంత్రి పదవి అట. అవును మొన్నీ మధ్యే ఎర్రబెల్లి లాంటి నేతల […]

ఎర్రబెల్లి టార్గెట్ అదే.... అందుకే వదలడం లేదట....
X

కేసీఆర్ పోయినసారే హామీ ఇచ్చాడట…. ఈసారి పక్కా అని…. అందుకే ప్రశ్నించిన జనాలను బతిమిలాడుతూ.. అసమ్మతిని బుజ్జగిస్తూ.. రైతులతో చెలిమిచేస్తూ.. పనివాళ్లతో పనివాడిగా మారిపోతూ ఎర్రబెల్లి దయాకర్ రావు ఇప్పుడు నియోజకవర్గంలో గెలుపు కోసం సకల కళావల్లభుడిగా మారిపోతున్నాడట. అస్సలు పని ఉంటే తప్పితే నియోజకవర్గం దాటి కాలు బయట పెట్టడం లేదట. ఇంతకీ ఎర్రబెల్లికి వచ్చిన ఆ హామీ ఏంటో తెలుసా? ఈసారి మంత్రి పదవి అట.

అవును మొన్నీ మధ్యే ఎర్రబెల్లి లాంటి నేతల వల్లే కేసీఆర్ తమను పట్టించుకోవడం లేదని కొండా సురేఖ దంపతులు ధ్వజమెత్తారు. అందరూ తిట్టినా ఎర్రబెల్లి స్పందించలేదు. కేసీఆర్ పిలిస్తే తప్పితే హైదరాబాద్ రావడం లేదట. నియోజకవర్గంలోనే ఉంటూ ఊరూరు తిరుగుతూ…. సోషల్ మీడియా క్యాంపెయిన్ కోసం ఓ టీంను కూడా పెట్టుకొని బాగా కష్టపడుతున్నాడట. ఈసారి ఖచ్చితంగా గెలవాలని విస్తృతంగా ప్రచారం చేస్తున్నాడట.

నిజానికి ఉమ్మడి వరంగల్ జిల్లాకు ఒక్కటే మంత్రి పదవి ఇవ్వడం ఆనవాయితీ. కానీ అక్కడ దిగ్గజ నేతల తాకిడి ఎక్కువ. ఇప్పటికే ఉప ముఖ్యమంత్రి కడియం కీలకంగా ఉన్నారు. వచ్చేసారి గెలిస్తే ఎర్రబెల్లికి ఇవ్వాలి. అందుకే పొమ్మనలేక కొండా సురేఖ వంటి రెబల్ స్టార్ కు పొగ పెట్టారనే ప్రచారం జరుగుతోంది. కొండా లాంటి బలమైన నేతలుంటే స్వేచ్చగా పనులు చేసుకోలేమనే…. ఆమె కోరికలను ఆసరా చేసుకొని టీఆర్ఎస్ అధిష్టానం సాగనంపారనే వాదన వినిపిస్తోంది. ఇందులో వరంగల్ జిల్లాకు చెందిన ఎర్రబెల్లి దయాకర్ రావు…. ఆయన సోదరుడు, ఇతర ముఖ్య నేతలు కూడా ప్రోత్సాహం అందించారనే ప్రచారం జరుగుతోంది.

ఏదీ ఏమైనా ఎర్రబెల్లి తనకు మంత్రి పదవి దక్కడంతోపాటు పోటీ ఎవరూ లేకుండా చేసుకున్నాడని టీఆర్ఎస్ శ్రేణులు వ్యాఖ్యానిస్తున్నాయి. మంత్రి పదవి పక్కా కావడంతోనే ఆయన ఇప్పుడు నియోజకవర్గాన్ని వదిలిపెట్టి రావడం లేదట. మొన్నీ మధ్య టీడీపీని ఎందుకు వీడావ్ అని కొందరు నియోజకవర్గ ప్రజలు ప్రశ్నిస్తే..‘తల్లి లాంటి పార్టీని విడిచి రావడం నాక్కూడా ఇష్టం లేకుండే’ అంటూ సెంటిమెంట్ రగిల్చాడు. ఇలా గెలవడానికి ఉన్న ఏ ఒక్క పాయింట్ ను కూడా వదలకుండా ఎర్రబెల్లి వ్యూహాలు రచించాడని…. అంతా ఆ మంత్రి పదవి కోసమేనని సన్నిహితులు కథలు కథలుగా చెబుతున్నారు.

First Published:  27 Sep 2018 10:50 AM GMT
Next Story