Telugu Global
NEWS

సెక్స్ రాకెట్ నిందితులతో వేదికపై బాబు.... చేదు అనుభవం

అమెరికా పర్యటనలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఊహించని అనుభవం ఎదురైంది. టీడీపీ ఎన్నారైల సభలోనే చేదు అనుభవం ఎదురైంది. టీడీపీ ఎన్నారై సభలో చంద్రబాబు ప్రసంగించేందుకు సిద్ధమవగానే సభికులు పెద్దెత్తున నినాదాలు చేశారు. దీంతో చంద్రబాబు తొలుత అవాక్కయ్యారు. ఇటీవల బయటపడ్డ షికాగో సెక్స్‌ రాకెట్‌లో ఆరోపణలు ఎదుర్కొన్న వారు చంద్రబాబుతో పాటు వేదికపై కూర్చోవడమే సభికుల అభ్యంతరానికి కారణం. సెక్స్‌ రాకెట్‌లో ఉన్న వారు ముఖ్యమంత్రితో కలిసి వేదిక మీద కూర్చోవడానికి వీల్లేదని.. ముందు వారిని […]

సెక్స్ రాకెట్ నిందితులతో వేదికపై బాబు.... చేదు అనుభవం
X

అమెరికా పర్యటనలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఊహించని అనుభవం ఎదురైంది. టీడీపీ ఎన్నారైల సభలోనే చేదు అనుభవం ఎదురైంది. టీడీపీ ఎన్నారై సభలో చంద్రబాబు ప్రసంగించేందుకు సిద్ధమవగానే సభికులు పెద్దెత్తున నినాదాలు చేశారు. దీంతో చంద్రబాబు తొలుత అవాక్కయ్యారు.

ఇటీవల బయటపడ్డ షికాగో సెక్స్‌ రాకెట్‌లో ఆరోపణలు ఎదుర్కొన్న వారు చంద్రబాబుతో పాటు వేదికపై కూర్చోవడమే సభికుల అభ్యంతరానికి కారణం. సెక్స్‌ రాకెట్‌లో ఉన్న వారు ముఖ్యమంత్రితో కలిసి వేదిక మీద కూర్చోవడానికి వీల్లేదని.. ముందు వారిని కిందకు పంపించాలంటూ పెద్దెత్తున ఎన్నారైలు నినాదాలు చేశారు. దీంతో చంద్రబాబు కూడా కాసేపు ఎవరికి ఏం చెప్పాలో కూడా తెలియక మాట్లాడకుండా ఉండిపోయారు.

ఇంతలో కొందరు పెద్దలు ఆందోళన చేస్తున్న వారి వద్దకు వెళ్లి ఏదైనా ఉంటే తర్వాత మాట్లాడుకుందాం…. సీఎం ప్రసంగానికి అడ్డుతగలడం సరికాదని సముదాయించారు. ముఖ్యమంత్రి కూడా వారికి సర్దిచెప్పారు. అనంతరం ప్రసంగాన్ని మొదలుపెట్టిన చంద్రబాబు…. కొద్ది సేపు మాత్రమే ప్రసంగించారు.

ఏపీ నుంచి హీరోయిన్లను, నటీమణులను తెలుగు సాంస్కృతిక కార్యక్రమాల పేరుతో అమెరికాకు రప్పించి అక్కడ వారితో వ్యభిచారం చేస్తున్న అంశాన్ని అమెరికా పోలీసులు బయటపెట్టారు.

ఆసమయంలో లోకేష్‌కు అత్యంత సన్నిహితుడైన తానా అధ్యక్షుడు సతీష్ వేమనతో పాటు పలువురు తానా ప్రతినిధులను ఎఫ్‌బీఐ పోలీసులు విచారించారు. ఇప్పుడు వారంతా చంద్రబాబు పర్యటనలో ఆయన వెన్నంటే ఉండడం, ముఖ్యమంత్రితో కలిసి దర్జాగా వేదికలపై కూర్చోవడంతో టీడీపీ ఎన్‌ఆర్‌ఐలు ఆగ్రహించి ఏకంగా చంద్రబాబు ప్రసంగానికే అడ్డుపడ్డారు.

First Published:  26 Sep 2018 9:40 PM GMT
Next Story