Telugu Global
International

ఆసియాకప్ లో టీమిండియా హిట్ మాన్ రోహిత్ శర్మ...

వన్డే క్రికెట్లో అరుదైన క్రికెటర్ రోహిత్ శర్మ ఓపెనర్ గా, కెప్టెన్ గా రోహిత్ సూపర్ హిట్ 2018 ఆసియాకప్ లో కెప్టెన్ గా రోహిత్ జోరు మొదటి నాలుగు మ్యాచ్ ల్లో సెంచరీ, 2 హాఫ్ సెంచరీలు 2018 ఆసియాకప్ క్రికెట్ టైటిల్ కు…టీమిండియా ఓపెనర్ కమ్ కెప్టెన్ రోహిత్ శర్మ గురిపెట్టాడు. ఇన్ స్టంట్ వన్డే క్రికెట్లో అరుదైన ఆటగాడిగా… కెప్టెన్ గా ద్విపాత్రాభినయం చేస్తున్న….. టీమిండియా హిట్ మాన్ రోహిత్ శర్మ పై […]

ఆసియాకప్ లో టీమిండియా హిట్ మాన్ రోహిత్ శర్మ...
X
  • వన్డే క్రికెట్లో అరుదైన క్రికెటర్ రోహిత్ శర్మ
  • ఓపెనర్ గా, కెప్టెన్ గా రోహిత్ సూపర్ హిట్
  • 2018 ఆసియాకప్ లో కెప్టెన్ గా రోహిత్ జోరు
  • మొదటి నాలుగు మ్యాచ్ ల్లో సెంచరీ, 2 హాఫ్ సెంచరీలు

2018 ఆసియాకప్ క్రికెట్ టైటిల్ కు…టీమిండియా ఓపెనర్ కమ్ కెప్టెన్ రోహిత్ శర్మ గురిపెట్టాడు. ఇన్ స్టంట్ వన్డే క్రికెట్లో అరుదైన ఆటగాడిగా… కెప్టెన్ గా ద్విపాత్రాభినయం చేస్తున్న….. టీమిండియా హిట్ మాన్ రోహిత్ శర్మ పై స్పెషల్ స్టోరీ.

రోహిత్ వైపే భారత్ చూపు….

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా జరుగుతున్న… 2018 ఆసియాకప్ క్రికెట్ టోర్నీ ఫైనల్ కు అలవోకగా చేరిన చాంపియన్ టీమిండియా ఏడో టైటిల్ కు గురిపెట్టింది.

కెప్టెన్ కమ్ ఓపెనర్ రోహిత్ శర్మ నాయకత్వంలో టైటిల్ సాధించాలన్న పట్టుదలతో ఉంది.

కెప్టెన్ విరాట్ కొహ్లీకి విశ్రాంతి ఇవ్వడంతో స్టాప్ గ్యాప్ కెప్టెన్ గా జట్టు పగ్గాలు చేపట్టిన రోహిత్ శర్మ….మూడుజట్ల గ్రూప్ లీగ్, నాలుగుజట్ల సూపర్ ఫోర్ రౌండ్లో..స్థాయికి తగ్గట్టుగా ఆడి…. రెండు హాఫ్ సెంచరీలు, ఓ సెంచరీతో చెలరేగిపోయాడు.

వన్డే క్రికెట్లో అత్యంత అరుదైన ఓపెనర్ గా మాత్రమే కాదు…విజయవంతమైన కెప్టెన్ గానూ రోహిత్ శర్మకు పేరుంది. ఒక్కమాటలో చెప్పాలంటే…ధూమ్ ధామ్ వన్డే ఫార్మాట్లో రోహిత్ శర్మ ఓ… వెరీ వెరీ స్పెషల్ క్రికెటర్.

19 సెంచరీలు, 36 హాఫ్ సెంచరీలు…

పదకొండు సంవత్సరాల క్రితం…2007 సిరీస్ లో భాగంగా బెల్ ఫాస్ట్ వేదికగా ఐర్లాండ్ తో జరిగిన మ్యాచ్ ద్వారా వన్డే అరంగేట్రం చేసిన రోహిత్… ఆ తర్వాత మరి వెనుదిరిగి చూసింది లేదు.

ప్రస్తుత ఆసియాకప్ లో పాకిస్థాన్ తో ముగిసిన సూపర్ ఫోర్ మ్యాచ్ వరకూ …రోహిత్ 19 సెంచరీలు, 36 హాఫ్ సెంచరీలతో అత్యంత విజయవంతమైన ఓపెనర్ గా నిలిచాడు.

7వేల 17 పరుగులతో 46.16 సగటు నమోదు చేశాడు.

అంతేకాదు…త్రీ-ఇన్-వన్ కెప్టెన్ విరాట్ కొహ్లీ అందుబాటులో లేని సమయంలో …టీమిండియా వన్డే, టీ-20 జట్లకు నాయకత్వం వహిస్తున్న…రోహిత్ శర్మకు…కెప్టెన్ గాను కళ్లు చెదిరే రికార్డు ఉంది.

ఇప్పటి వరకూ ఏడు వన్డేల్లో కెప్టెన్ గా వ్యవహరించిన రోహిత్ 400కు పైగా పరుగులతో ..108.05 సగటు నమోదు చేశాడు.

ఒకే ఒక్కడు రోహిత్ శర్మ

వన్డే క్రికెట్ చరిత్రలోనే మూడు డబుల్ సెంచరీలు సాధించిన ఒకేఒక్కడుగా కూడా రోహిత్ కు గుర్తింపు ఉంది.

2013 లో బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా ఆస్ట్రేలియాతో ముగిసిన మ్యాచ్ లో రోహిత్ తొలి డబుల్ సెంచరీ బాదాడు.

ఆ తర్వాతి ఏడాది .. శ్రీలంకపై 264 పరుగుల స్కోరుతో ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. గత ఏడాది శ్రీలంకపై 208 నాటౌట్ స్కోరు సాధించడం ద్వారా…రోహిత్ శర్మ తన కెరియర్ లో మూడో డబుల్ సెంచరీ సాధించాడు.

ఇక…ప్రస్తుత ఆసియాకప్ సూపర్ ఫోర్ రౌండ్లో…చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ పై రోహిత్ 111 పరుగుల నాటౌట్ స్కోరుతో నిలిచాడు. టీ-20ల్లో సైతం.. మూడు సెంచరీలు, వన్డే క్రికెట్లో మూడు డబుల్ సెంచరీలు సాధించిన ఏకైక భారత క్రికెటర్ రోహిత్ శర్మ మాత్రమే.

ఏడాది విరామం తర్వాత… టీమిండియా వన్డే జట్టుకు నాయకత్వం వహిస్తున్న రోహిత్ శర్మ….ఆసియాకప్ ను సైతం అందించాలన్న పట్టుదలతో ఉన్నాడు.

ఇప్పటికే తనజట్టును ఫైనల్స్ చేర్చిన రోహిత్…టైటిల్ సమరంలో…ఏ స్థాయిలో చెలరేగిపోతాడో మరి.

First Published:  27 Sep 2018 1:10 AM GMT
Next Story