Telugu Global
Cinema & Entertainment

 స్టేట్ రౌడీగా రామ్ చరణ్

ప్రస్తుతం రామ్ చరణ్ అజర్ బైజాన్ లో ఉన్నాడు. బోయపాటి దర్శకత్వంలో చేస్తున్న సినిమా షూటింగ్ అక్కడ జరుగుతోంది. కానీ ఆ మూవీకి సంబంధించిన ప్రకంపనలు మాత్రం ఇక్కడ కనిపిస్తున్నాయి. అవును.. యూనిట్ ఇక్కడ లేకపోయినా టాలీవుడ్ లో రామ్ చరణ్ కొత్త సినిమా సంచలనం సృష్టిస్తోంది. దీనికి కారణం చిరంజీవి సినిమా టైటిల్. అవును.. గతంలో చిరంజీవి నటించిన స్టేట్ రౌడీ అనే సినిమా టైటిల్ ను యథాతథంగా రామ్ చరణ్ మూవీ కోసం వాడబోతున్నారట. […]

 స్టేట్ రౌడీగా రామ్ చరణ్
X

ప్రస్తుతం రామ్ చరణ్ అజర్ బైజాన్ లో ఉన్నాడు. బోయపాటి దర్శకత్వంలో చేస్తున్న సినిమా షూటింగ్ అక్కడ జరుగుతోంది. కానీ ఆ మూవీకి సంబంధించిన ప్రకంపనలు మాత్రం ఇక్కడ కనిపిస్తున్నాయి. అవును.. యూనిట్ ఇక్కడ లేకపోయినా టాలీవుడ్ లో రామ్ చరణ్ కొత్త సినిమా సంచలనం సృష్టిస్తోంది. దీనికి కారణం చిరంజీవి సినిమా టైటిల్.

అవును.. గతంలో చిరంజీవి నటించిన స్టేట్ రౌడీ అనే సినిమా టైటిల్ ను యథాతథంగా రామ్ చరణ్ మూవీ కోసం వాడబోతున్నారట. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది. కథ ప్రకారం, స్టేట్ రౌడీ అనే టైటిల్ అయితే పెర్ ఫెక్ట్ గా ఉంటుందని యూనిట్ కూడా భావిస్తున్నట్టు కథనాలు వస్తున్నాయి.

బి.గోపాల్, చిరంజీవి కాంబోలో వచ్చిన మొట్టమొదటి సినిమా స్టేట్ రౌడీ. నైజాంలో చిరంజీవికి కోటి రూపాయల షేర్ సాధించి పెట్టిన సినిమా ఇది. ఈ సినిమా తర్వాతే చిరంజీవి, తన పారితోషికంలో భాగంగా నైజాం రైట్స్ తీసుకోవడం స్టార్ట్ చేశారు.

అంతలా చిరు కెరీర్ ను ప్రభావితం చేసిన స్టేట్ రౌడీ అనే టైటిల్ ను చరణ్ సినిమాకు పెట్టబోతున్నారట. ఈ మూవీ ఫస్ట్ లుక్ ను దసరా రోజున విడుదల చేయబోతున్నారు. ఆరోజున ఫస్ట్ లుక్ పోస్టర్ తో పాటు టైటిల్ ను అధికారికంగా ప్రకటించబోతున్నారు.

First Published:  26 Sep 2018 6:01 AM GMT
Next Story