Telugu Global
Cinema & Entertainment

ఇకపై కొత్త నానిని చూస్తారు

కృష్ణార్జున యుద్ధం ఫ్లాప్ తో డల్ అయ్యాడు నాని. వరుసగా హిట్స్ కొట్టిన తర్వాత ఓ డిజాస్టర్ తగిలితే ఎవరికైనా బాధే. దేవదాస్ సక్సెస్ తో ఆ బాధను మరిచిపోతానంటున్నాడు నాని. ఇదిలా ఉండగా, దేవదాస్ తర్వాత నాని చేయబోయే మూవీపై చాలా బజ్ నడుస్తోంది. ఆ అంచనాలకు తగ్గట్టే సినిమాకు సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాల్ని మీడియాతో పంచుకున్నాడు నాని. “దేవదాస్ రిలీజ్ అయిపోగానే ఓ వారం రోజులు రెస్ట్ తీసుకుంటా. ఆ తర్వాత జెర్సీ […]

ఇకపై కొత్త నానిని చూస్తారు
X
కృష్ణార్జున యుద్ధం ఫ్లాప్ తో డల్ అయ్యాడు నాని. వరుసగా హిట్స్ కొట్టిన తర్వాత ఓ డిజాస్టర్ తగిలితే ఎవరికైనా బాధే. దేవదాస్ సక్సెస్ తో ఆ బాధను మరిచిపోతానంటున్నాడు నాని. ఇదిలా ఉండగా, దేవదాస్ తర్వాత నాని చేయబోయే మూవీపై చాలా బజ్ నడుస్తోంది. ఆ అంచనాలకు తగ్గట్టే సినిమాకు సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాల్ని మీడియాతో పంచుకున్నాడు నాని.
“దేవదాస్ రిలీజ్ అయిపోగానే ఓ వారం రోజులు రెస్ట్ తీసుకుంటా. ఆ తర్వాత జెర్సీ సినిమా స్టార్ట్ చేస్తాను. దసరాకు ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేస్తాం. ఈ మూవీలో నేను క్రికెటర్ గా కనిపించబోతున్నాను. క్రికెటర్ అంటే బౌలర్ కాదు, బ్యాట్స్ మన్ గా కనిపిస్తా. దీనికోసం రోజూ బూత్ బంగ్లాలో 3 గంటల పాటు క్రికెట్ ప్రాక్టీస్ చేస్తున్నాను. ఒళ్లు హూనం అయిపోతోంది. చెమట్లు కారుతున్నాయి. త్వరలోనే ఓ కొత్త నానిని చూస్తారు.”
ఇలా జెర్సీకి సంబంధించిన వివరాల్ని బయటపెట్టాడు నాని. కోలీవుడ్ మ్యూజిక్ డైరక్టర్ అనిరుధ్ ఈ సినిమాకు సంగీతం అందిస్తాడని, తన కెరీర్ లోనే బెస్ట్ మూవీగా జెర్సీ నిలిచిపోతుందని అంటున్నాడు నాని. ప్రస్తుతం తన ఫోకస్ మొత్తం జెర్సీపైనే ఉందని, ఆ సినిమా షూటింగ్ పూర్తిచేసుకొని థియేటర్లలోకి వచ్చిన వరకు మరో సినిమా ఎనౌన్స్ చేయనని తేల్చిచెప్పేశాడు. మళ్లీ రావా సినిమాతో దర్శకుడిగా మారిన గౌతమ్ తిన్ననూరి, జెర్సీ మూవీని డైరక్ట్ చేయబోతున్నాడు.
First Published:  26 Sep 2018 11:00 AM GMT
Next Story