Telugu Global
Cinema & Entertainment

సింగర్ గా మారిన హీరో రామ్

ఎనర్జిటిక్ హీరో రామ్ ప్రస్తుతం త్రినాద్ రావు నక్కిన దర్శకత్వంలో “హలో గురు ప్రేమకోసమే” సినిమా చేస్తున్నాడు.ఈ సినిమాలో రామ్ సరసన అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే “అత్తారింటికి దారేది” ఫేం ప్రనిత కూడా ఈ సినిమా ఒక ముఖ్య పాత్రలో నటిస్తుంది. ఈ సినిమా ఆడియో దేవిశ్రీ మ్యూజిక్ డైరెక్షన్ లో రూపొందించబడుతుంది. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా లో దేవి శ్రీ ప్రసాద్ ప్రోత్సాహంతో రామ్ ఒక పాట […]

సింగర్ గా మారిన హీరో రామ్
X

ఎనర్జిటిక్ హీరో రామ్ ప్రస్తుతం త్రినాద్ రావు నక్కిన దర్శకత్వంలో “హలో గురు ప్రేమకోసమే” సినిమా చేస్తున్నాడు.ఈ సినిమాలో రామ్ సరసన అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే “అత్తారింటికి దారేది” ఫేం ప్రనిత కూడా ఈ సినిమా ఒక ముఖ్య పాత్రలో నటిస్తుంది. ఈ సినిమా ఆడియో దేవిశ్రీ మ్యూజిక్ డైరెక్షన్ లో రూపొందించబడుతుంది.

అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా లో దేవి శ్రీ ప్రసాద్ ప్రోత్సాహంతో రామ్ ఒక పాట పాడి తనలోని సింగర్ ని ఈ సినిమాతో ప్రేక్షకులకి పరిచయం చేయబోతున్నాడు అని తెలిసింది. ఈ పాట కి సంభందించిన రికార్డింగ్ ని దేవి శ్రీ ప్రసాద్ పూర్తీ చేసాడు అంట. ప్రకాష్ రాజ్ కీలక పాత్ర పోషిస్తున్న ఈ సినిమాని దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్నాడు. చాలా రోజుల తరువాత రామ్… దిల్ కాంబినేషన్ లో సినిమా వస్తుండటంతో ఈ సినిమా పై అందరిలోనూ భారి అంచనాలు ఉన్నాయి. వచ్చే నెల అక్టోబర్ 18 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి రానుంది.

First Published:  26 Sep 2018 11:16 AM GMT
Next Story