Telugu Global
NEWS

గిడ్డి ఈశ్వరి కోసం షాడో టీం.... లిస్ట్‌లో 200 మంది

ఎమ్మెల్యే కిడారి హత్యతో అధికార పార్టీ నేతల్లో అలజడి మొదలైంది. ఇప్పటికే అధికార పార్టీకి చెందిన పలువురికి మావోయిస్టులు హెచ్చరికలు జారీ చేశారు. అయితే మావోయిస్టుల బలహీనపడ్డారన్న ఉద్దేశంతో ప్రజాప్రతినిధులు వాటిని లైట్ తీసుకుంటూ వచ్చారు. కానీ ఎమ్మెల్యే కిడారి హత్యతో వారంతా ఇప్పుడు ఆందోళన చెందుతున్నారు. మొత్తం 200 మంది ప్రజాప్రతినిధులు మావోయిస్టుల జాబితాలో ఉన్నారు. ఏజెన్సీ ప్రాంతానికి సంబంధించి మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు కుమారుడిపై, ఫిరాయింపు ఎమ్మెల్యే గిడ్ఢి ఈశ్వరిపై మావోయిస్టులు ఎక్కువగా ఫోకస్ […]

గిడ్డి ఈశ్వరి కోసం షాడో టీం.... లిస్ట్‌లో 200 మంది
X

ఎమ్మెల్యే కిడారి హత్యతో అధికార పార్టీ నేతల్లో అలజడి మొదలైంది. ఇప్పటికే అధికార పార్టీకి చెందిన పలువురికి మావోయిస్టులు హెచ్చరికలు జారీ చేశారు. అయితే మావోయిస్టుల బలహీనపడ్డారన్న ఉద్దేశంతో ప్రజాప్రతినిధులు వాటిని లైట్ తీసుకుంటూ వచ్చారు. కానీ ఎమ్మెల్యే కిడారి హత్యతో వారంతా ఇప్పుడు ఆందోళన చెందుతున్నారు.

మొత్తం 200 మంది ప్రజాప్రతినిధులు మావోయిస్టుల జాబితాలో ఉన్నారు. ఏజెన్సీ ప్రాంతానికి సంబంధించి మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు కుమారుడిపై, ఫిరాయింపు ఎమ్మెల్యే గిడ్ఢి ఈశ్వరిపై మావోయిస్టులు ఎక్కువగా ఫోకస్ పెట్టినట్టు చెబుతున్నారు. మైనింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రి అయ్యన్నపాత్రుడి కుమారుడు, అయ్యన్న సోదరుడు సన్యాసి పాత్రుడు, మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు, ఆయన అనుచరుడు వినాయక్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.

గిడ్డి ఈశ్వరి వ్యవహారాలు చక్కబెట్టే వ్యక్తిగత కార్యదర్శి గోవిందరావు పేరు కూడా హిట్‌ లిస్ట్‌లో ఉన్నట్టు చెబుతున్నారు. ఈ విషయాన్ని గుర్తించిన పోలీసులు ప్రజాప్రతినిధులుకు స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు. గ్రామీణ ప్రాంతాలను వదిలి సిటీలకు వెళ్లిపోవాల్సిందిగా ప్రజాప్రతినిధులకు సూచించారు. పార్టీ ఫిరాయించిన తర్వాత మైనింగ్‌ విషయంలో చంద్రబాబు ప్రభుత్వానికి గిడ్డి ఈశ్వరి వంతపాడుతున్నారని మావోయిస్టులు ఆగ్రహంగా ఉన్నారు.

ఈ నేపథ్యంలో మంత్రి అయ్యన్నపాత్రుడితో పాటు గిడ్డి ఈశ్వరికి భద్రత మరింత పెంచారు. గన్‌మెన్ల సంఖ్యను పెంచారు. అయ్యన్న, గిడ్డి ఈశ్వరి పర్యటనకు వెళ్లిన సమయంలో అక్కడి పరిస్థితులను గమనించేందుకు సివిల్ డ్రెస్‌లో షాడో టీంలను ఏర్పాటు చేస్తున్నారు. మంత్రి అయ్యన్నకు బుల్లెట్ ఫ్రూప్ వాహనాన్ని ఇది వరకు ప్రభుత్వం కేటాయించింది. వీలైనంత వరకు గ్రామీణ ప్రాంతాల్లోకి వెళ్లవద్దని అయ్యన్న, గిడ్డి ఈశ్వరికి పోలీసులు సూచించారు.

First Published:  26 Sep 2018 1:37 AM GMT
Next Story