Telugu Global
NEWS

పవన్‌ కళ్యాణ్‌ను చాలెంజ్‌ చేసిన చింతమనేని

దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ను మీరు కంట్రోల్ చేస్తారా లేక తామే తేల్చుకోమంటారా అని చంద్రబాబుకు పవన్ కల్యాణ్ విసిరిన సవాల్‌పై చింతమనేని ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు. ఒక చానల్‌తో మాట్లాడిన చింతమనేని…. రాజకీయ అనుభవం లేని పవన్ కల్యాణ్…. ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్‌ను చదువుతున్నారని ఎద్దేవా చేశారు. తానే టీడీపీని గెలిపించినట్టు పవన్‌ కల్యాణ్ మాట్లాడడం సరికాదన్నారు. సొంత అన్నను గెలిపించుకోలేని వాడు తమను ఏం గెలిపిస్తారని ప్రశ్నించారు. ఈ విషయాన్ని పవన్‌ కల్యాణ్‌కు చెందిన […]

పవన్‌ కళ్యాణ్‌ను చాలెంజ్‌ చేసిన చింతమనేని
X

దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ను మీరు కంట్రోల్ చేస్తారా లేక తామే తేల్చుకోమంటారా అని చంద్రబాబుకు పవన్ కల్యాణ్ విసిరిన సవాల్‌పై చింతమనేని ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు. ఒక చానల్‌తో మాట్లాడిన చింతమనేని…. రాజకీయ అనుభవం లేని పవన్ కల్యాణ్…. ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్‌ను చదువుతున్నారని ఎద్దేవా చేశారు.

తానే టీడీపీని గెలిపించినట్టు పవన్‌ కల్యాణ్ మాట్లాడడం సరికాదన్నారు. సొంత అన్నను గెలిపించుకోలేని వాడు తమను ఏం గెలిపిస్తారని ప్రశ్నించారు. ఈ విషయాన్ని పవన్‌ కల్యాణ్‌కు చెందిన 99 టీవీతోనే తాను చెప్పానన్నారు చింతమనేని. మిడిమిడి జ్ఞానంతో పవన్‌ కల్యాణ్ మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు.

తనను రాజ్యాంగేతర శక్తి అంటున్నపవన్ కల్యాణ్‌కు దమ్ము ధైర్యం ఉంటే… వచ్చి తనపై పోటీ చేయాలన్నారు. తన దృష్టిలో పవన్ కల్యాణ్, ఒక మహిళా కార్యకర్త ఇద్దరూ ఒక్కటేనన్నారు. అయితే వేరే వారిని తనపై పోటీ చేయిస్తే…. ఓడిపోయిన తర్వాత చింతమనేని కండబలం, డబ్బు బలం వల్ల ఓడిపోయామని మాట్లాడే అవకాశం ఉంటుందని…. కాబట్టి పవన్‌ కల్యాణే నేరుగా తనపై పోటీ చేస్తే ఎవరు రాజ్యాంగేతర శక్తో…. ఎవరు రాముడో ఎవరు రావణుడో ప్రజలే తేలుస్తారని చింతమనేని సవాల్ చేశారు.

First Published:  26 Sep 2018 6:37 AM GMT
Next Story