Telugu Global
International

2018 ఆసియాకప్ లో తొలి సూపర్ టై

టైగా ముగిసిన టీమిండియా-అప్ఘన్ జట్ల పోటీ ఫైనల్లో టీమిండియా, అప్ఘాన్ అవుట్ ఆసియాకప్ సూపర్ ఫోర్ ఆఖరి రౌండ్ మ్యాచ్ లో డిఫెండింగ్ చాంపియన్ టీమిండియాను…10వ ర్యాంకర్ అప్ఘనిస్థాన్… టైతో కట్టిపడేసింది. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా ముగిసిన ఈమ్యాచ్ లో రెండుజట్లూ… 50 ఓవర్లలో 252 పరుగుల స్కోరే సాధించడంతో మ్యాచ్… టైగా ముగిసింది. ఆసియాకప్ లో ఉత్కం…టై…… యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా గత వారం రోజులుగా జరుగుతున్న ఆసియాకప్ టోర్నీలో …రెండో ఘట్టం […]

2018 ఆసియాకప్ లో తొలి సూపర్ టై
X
  • టైగా ముగిసిన టీమిండియా-అప్ఘన్ జట్ల పోటీ
  • ఫైనల్లో టీమిండియా, అప్ఘాన్ అవుట్

ఆసియాకప్ సూపర్ ఫోర్ ఆఖరి రౌండ్ మ్యాచ్ లో డిఫెండింగ్ చాంపియన్ టీమిండియాను…10వ ర్యాంకర్ అప్ఘనిస్థాన్… టైతో కట్టిపడేసింది. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా ముగిసిన ఈమ్యాచ్ లో రెండుజట్లూ… 50 ఓవర్లలో 252 పరుగుల స్కోరే సాధించడంతో మ్యాచ్… టైగా ముగిసింది.

ఆసియాకప్ లో ఉత్కం…టై……

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా గత వారం రోజులుగా జరుగుతున్న ఆసియాకప్ టోర్నీలో …రెండో ఘట్టం సూపర్ ఫోర్ రౌండ్ లో … ఉత్కంఠ భరితమైన టై మ్యాచ్ నమోదయ్యింది.

దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా ముగిసిన ఈమ్యాచ్ లో… సంచలనాల అప్ఘనిస్థాన్ పై… రెండోర్యాంకర్ టీమిండియా హాట్ ఫేవరెట్ గా పోటీకి దిగింది. అంతేకాదు…టీమిండియా విజయం ఖాయమనే అభిమానులు అనుకొన్నారు. అయితే…..చివరకు మ్యాచ్ ఫలితం మాత్రం టైగా ముగియక తప్పలేదు.

ఓపెనర్ షా…జాదూ….

ఇప్పటికే ఫైనల్ బెర్త్ ఖాయం చేసుకొన్న టీమిండియాకు ..అంతగా ప్రాధాన్యం లేని ఈ మ్యాచ్ లో ….అప్ఘనిస్థాన్ ముందుగా టాస్ నెగ్గి… బ్యాటింగ్ ఎంచుకొంది. ఓపెనర్ మహ్మద్ షాజాద్ మెరుపు సెంచరీకి.. ఆల్ రౌండర్ మహ్మద్ నబీ హాఫ్ సెంచరీ తోడు కావడంతో….అప్ఘన్ జట్టు 50 ఓవర్లలో 8 వికెట్లకు 252 పరుగులు మాత్రమే చేయగలిగింది.

కెప్టెన్ రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్ శిఖర్ ధావన్ తో సహా ఐదుగురు కీలక ఆటగాళ్లకు విశ్రాంతి నివ్వడం ద్వారా…టీమిండియా తగిన మూల్యమే చెల్లించింది. అపార అనుభవం ఉన్న స్టాండిన్ కెప్టెన్ ధోనీ సైతం…అప్ఘన్ దూకుడును సమర్థవంతంగా అడ్డుకోలేక పోయాడు. టీమిండియా బౌలర్లలో జడేజా 3, కుల్దీప్ యాదవ్ 2 వికెట్లు పడగొట్టారు.

మిడిలార్డర్ టపటపా

మ్యాచ్ నెగ్గాలంటే…253 పరుగుల టార్గెట్ తో చేజింగ్ కు దిగిన టీమిండియాకు ఓపెనర్లు రాహుల్, అంబటి రాయుడు…స్ట్రోక్ ఫుల్ హాఫ్ సెంచరీలతో.. మొదటి వికెట్ కు 110 పరుగుల భాగస్వామ్యంతో… అద్దిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు.

రాయుడు 49 బాల్స్ లోనే నాలుగు బౌండ్రీలు, నాలుగు సిక్సర్లతో 57 పరుగుల స్కోరుకు…17 ఓవర్లో అవుట్ కావడంతో…అఫ్ఘన్ బౌలర్లు తొలివికెట్ పడగొట్టగలిగారు.

వన్ డౌన్ లో వచ్చిన కార్తీక్ 44 పరుగులు, ఓపెనర్ రాహుల్ 60 పరుగుల స్కోర్లు సాధించినా…మిడిలార్డర్ పేకమేడలా కూలడంతో…. మ్యాచ్ ఉత్కంఠదశకు చేరింది.

కెప్టెన్ ధోనీ, మనీశ్ పాండే చెరో 8 పరుగుల స్కోర్లకు అవుట్ కాగా…జట్టు విజయభారం మాత్రం…ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాపైన పడింది. జడేజా 25, చాహర్ 12 పరుగులతో పోరాడిన టీమిండియా 49.5 ఓవర్లలో 252 పరుగులకే ఆలౌట్ కావడంతో…మ్యాచ్ టైగా ముగిసింది.

అప్ఘన్ బౌలర్లలో స్పిన్నర్లు రషీద్ ఖాన్, నబీ, పేసర్ అఫ్తాబ్ అలం తలో రెండు వికెట్లు పడగొట్టారు.

అప్ఘనిస్థాన్ 252 పరుగుల భారీస్కోరు సాధించడంలో ప్రధానపాత్ర వహించిన ఓపెనర్ మహ్మద్ షాజాద్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

సూపర్ ఫోర్ రౌండ్లో… అజేయంగా నిలిచిన టీమిండియా ..ఫైనల్ బెర్త్ ఖాయం చేసుకోగా…. బంగ్లా, పాక్ జట్ల చేతిలో పరాజయాలు పొందిన అప్ఘన్ జట్టు… టోర్నీ నుంచి నిష్క్రమించింది.

First Published:  26 Sep 2018 6:35 AM GMT
Next Story