Telugu Global
Cinema & Entertainment

అజయ్ భూపతి దర్శకత్వంలో అల్లు అర్జున్ సినిమా

“ఆర్ ఎక్స్ 100” సినిమాతో ఇండస్ట్రీ దృష్టిని మొత్తం ఆకట్టుకున్న దర్శకుడు అజయ్ భూపతి. అజయ్ ఈ సినిమాని తెరకెక్కించిన తీరు మన హీరోలకి బాగా నచ్చింది. అందుకే ఇప్పుడు ఈ దర్శకుడిని పిలిచి మరి అవకాశాలు ఇస్తున్నారు హీరోలు. ప్రస్తుతం నితిన్ తో ఒక సినిమా తెరకేక్కిస్తున్నాడు అజయ్ భూపతి. అయితే ఈ సినిమా ఇంకా కథ చర్చల్లో ఉండగానే అల్లు అర్జున్ నుంచి పిలుపు వచ్చింది అజయ్ భూపతికి. అల్లు అర్జున్ అజయ్ ని […]

అజయ్ భూపతి దర్శకత్వంలో అల్లు అర్జున్ సినిమా
X

“ఆర్ ఎక్స్ 100” సినిమాతో ఇండస్ట్రీ దృష్టిని మొత్తం ఆకట్టుకున్న దర్శకుడు అజయ్ భూపతి. అజయ్ ఈ సినిమాని తెరకెక్కించిన తీరు మన హీరోలకి బాగా నచ్చింది. అందుకే ఇప్పుడు ఈ దర్శకుడిని పిలిచి మరి అవకాశాలు ఇస్తున్నారు హీరోలు. ప్రస్తుతం నితిన్ తో ఒక సినిమా తెరకేక్కిస్తున్నాడు అజయ్ భూపతి. అయితే ఈ సినిమా ఇంకా కథ చర్చల్లో ఉండగానే అల్లు అర్జున్ నుంచి పిలుపు వచ్చింది అజయ్ భూపతికి.

అల్లు అర్జున్ అజయ్ ని తన ఆఫీస్ కి పిలిపించుకొని కథ చెప్పించుకున్నాడట. ఇలాంటి కథలు కాదు నా కోసం ప్రత్యేకంగా ఒక కథ రెడీ చేసుకొని రా అని అజయ్ కి చెప్పాడట అల్లు అర్జున్. తన సొంత బ్యానర్ అయిన గీత ఆర్ట్స్ నుంచే అల్లు అర్జున్ ఈ సినిమాని ప్రొడ్యూస్ చేసే అవకాశాలు ఉన్నాయి. నితిన్ తో సినిమా అయిపోగానే అల్లు అర్జున్ కథ పై వర్క్ చేయనున్నాడు అజయ్ భూపతి.

First Published:  26 Sep 2018 1:58 AM GMT
Next Story