Telugu Global
Cinema & Entertainment

వెంకీతో యంగ్ డైరెక్టర్ సినిమా

హీరో నుంచి నటుడిగా మారిన వెంకీ అట్లూరి తన తోలి సినిమా అయిన “తొలిప్రేమ” తో మంచి హిట్ ని సంపాదించుకున్నాడు. ఆ సినిమా సక్సెస్ తరువాత వెంకీ కి అక్కినేని కాంపౌండ నుంచి కాల్ వచ్చింది. అందుకే తన రెండో సినిమాని అక్కినేని అఖిల్ తో “మిస్టర్ మజ్ను”. ఇటివలే రిలీజ్ అయిన టిజర్ తో ఈ సినిమా పై అందరి అంచనాల్ని పెంచేసాడు వెంకీ. ఈ సినిమా చివరి దశలో ఉండగానే వెంకీ అట్లూరి […]

వెంకీతో యంగ్ డైరెక్టర్ సినిమా
X

హీరో నుంచి నటుడిగా మారిన వెంకీ అట్లూరి తన తోలి సినిమా అయిన “తొలిప్రేమ” తో మంచి హిట్ ని సంపాదించుకున్నాడు. ఆ సినిమా సక్సెస్ తరువాత వెంకీ కి అక్కినేని కాంపౌండ నుంచి కాల్ వచ్చింది. అందుకే తన రెండో సినిమాని అక్కినేని అఖిల్ తో “మిస్టర్ మజ్ను”. ఇటివలే రిలీజ్ అయిన టిజర్ తో ఈ సినిమా పై అందరి అంచనాల్ని పెంచేసాడు వెంకీ. ఈ సినిమా చివరి దశలో ఉండగానే వెంకీ అట్లూరి తన మూడో సినిమాకి సిద్దం అవుతున్నాడు అని తెలుస్తుంది.

తన మూడో సినిమా కోసం కథ రెడీ చేసుకున్న వెంకీ ఆ కథని డైరెక్ట్ గా తీసుకొని వెళ్ళి విక్టరీ వెంకటేష్ కి న్యారేట్ చేసాడట వెంకీ. కథ నచ్చిన వెంకీ ఈ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినాట్టు తెలిస్తుంది. వెంకీ అట్లూరి తో “తొలిప్రేమ” “మిస్టర్ మజ్ను” సినిమాలని ప్రొడ్యూస్ చేసిన బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ ఈ సినిమాని కూడా ప్రొడ్యూస్ చేయనున్నాడు అని టాక్. మొత్తానికి తొలి రెండు సినిమాలు యంగ్ హీరోలతో చేసి మూడో సినిమాకి స్టార్ హీరోని పట్టేసాడు వెంకీ.

First Published:  25 Sep 2018 1:23 AM GMT
Next Story