Telugu Global
NEWS

బ్యాంకుల‌కు 5 వేల కోట్లు ఎగ‌నామం పెట్టిన గుజ‌రాత్‌ వ్యాపార‌వేత్త....

గుజ‌రాత్‌కి చెందిన వ్యాపార‌వేత్త బ్యాంకుల‌ను బురిడీ కొట్టించాడు. ప్ర‌భుత్వ రంగ బ్యాంకుల‌కు 5,700 కోట్ల రూపాయ‌లు ఎగ‌నామం పెట్టి దేశం నుంచి జారుకున్నాడు. ప్ర‌స్తుతం అత‌డు నైజీరియాలో త‌ల‌దాచుకుంటున్నాడ‌ని ద‌ర్యాప్తు సంస్థ‌లు భావిస్తున్నాయి. స్టెర్లింగ్ బ‌యోటెక్ సంస్థ‌కు చెందిన చేత‌న్, నితిన్ అనే ఇద్ద‌రు సోద‌రులు ప్ర‌భుత్వ రంగ బ్యాంకుల నుంచి భారీగా అప్పులు పొందారు. వాటిని తిరిగి చెల్లించ‌లేదు. దీంతో బ్యాంకులు సీబీఐకి ఫిర్యాదు చేశాయి. సీబీఐతో పాటు ఈడీ కూడా రంగంలోకి దిగి స్టెర్లింగ్ […]

బ్యాంకుల‌కు 5 వేల కోట్లు ఎగ‌నామం పెట్టిన గుజ‌రాత్‌ వ్యాపార‌వేత్త....
X

గుజ‌రాత్‌కి చెందిన వ్యాపార‌వేత్త బ్యాంకుల‌ను బురిడీ కొట్టించాడు. ప్ర‌భుత్వ రంగ బ్యాంకుల‌కు 5,700 కోట్ల రూపాయ‌లు ఎగ‌నామం పెట్టి దేశం నుంచి జారుకున్నాడు. ప్ర‌స్తుతం అత‌డు నైజీరియాలో త‌ల‌దాచుకుంటున్నాడ‌ని ద‌ర్యాప్తు సంస్థ‌లు భావిస్తున్నాయి.

స్టెర్లింగ్ బ‌యోటెక్ సంస్థ‌కు చెందిన చేత‌న్, నితిన్ అనే ఇద్ద‌రు సోద‌రులు ప్ర‌భుత్వ రంగ బ్యాంకుల నుంచి భారీగా అప్పులు పొందారు. వాటిని తిరిగి చెల్లించ‌లేదు. దీంతో బ్యాంకులు సీబీఐకి ఫిర్యాదు చేశాయి. సీబీఐతో పాటు ఈడీ కూడా రంగంలోకి దిగి స్టెర్లింగ్ బ‌యోటెక్‌కు చెందిన ప‌లువురిపై కేసులు న‌మోదు చేసింది. ఈలోగా వారంతా దేశం విడిచి పారిపోయారు.

బ్యాంకుల నుంచి 5,700 కోట్ల రూపాయ‌ల రుణాలు తీసుకున్న స్టెర్లింగ్ బ‌యోటెక్‌కి చెందిన నితిన్… ఆ మొత్తాన్ని 300 డొల్ల కంపెనీల ద్వారా విదేశాల్లోని అకౌంట్ల‌కు అక్ర‌మంగా త‌ర‌లించాడ‌ని తెలుస్తోంది.

ఈ నేప‌థ్యంలో కేసు న‌మోదు చేసిన ఈడీ… స్టెర్లింగ్ బ‌యోటెక్‌కు చెందిన 4700 కోట్ల ఆస్తుల‌ను జ‌ప్తు చేసింది. ప్ర‌స్తుతం నిందితుడు నైజీరియాలో త‌ల‌దాచుకుంటున్నాడ‌ని భావిస్తున్న అధికారులు వారిని భార‌త్ ర‌ప్పించేందుకు ప్ర‌య‌త్నాలు ప్రారంభించారు. ఇంట‌ర్‌పోల్ ద్వారా రెడ్ కార్న‌ర్ నోటీస్ జారీ చేసేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు.

నైజీరీయా దేశంతో భార‌త్‌కు ఖైదీల అప్ప‌గింత ఒప్పందం లేనందున వీరిని భార‌త్ ర‌ప్పించేందుకు ఆల‌స్యం అయ్యే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది.

First Published:  24 Sep 2018 11:05 PM GMT
Next Story