Telugu Global
Cinema & Entertainment

సినిమా స్టోరీ చెప్పేసిన దేవ, దాసు

దేవదాస్ సినిమాకు డిఫరెంట్ గా ప్రచారం కల్పిస్తున్నారు హీరోలిద్దరూ. ఆడియో ఫంక్షన్ లో ఇద్దరూ చిందేశారు. హీరోయిన్లతో కూడా డాన్స్ చేయించారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒకరి దురలవాట్లను మరొకరు సరదాగా షేర్ చేసుకుంటున్నారు. ఒకరిపై ఒకరు కామెంట్స్ చేసుకుంటున్నారు. ఈ హడావుడిలో సినిమా స్టోరీని బయటపెట్టేశారు ఈ ఇద్దరు హీరోలు. సినిమాలో దాస్ (నాని) ఓ మిడిల్ క్లాస్ డాక్టర్. టాలెంట్ కాస్త ఉన్నోడే. కానీ పర్సనల్ గా కలిగిన ఓ ఇబ్బంది వల్ల ప్రాక్టీస్ […]

సినిమా స్టోరీ చెప్పేసిన దేవ, దాసు
X

దేవదాస్ సినిమాకు డిఫరెంట్ గా ప్రచారం కల్పిస్తున్నారు హీరోలిద్దరూ. ఆడియో ఫంక్షన్ లో ఇద్దరూ చిందేశారు. హీరోయిన్లతో కూడా డాన్స్ చేయించారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒకరి దురలవాట్లను మరొకరు సరదాగా షేర్ చేసుకుంటున్నారు. ఒకరిపై ఒకరు కామెంట్స్ చేసుకుంటున్నారు. ఈ హడావుడిలో సినిమా స్టోరీని బయటపెట్టేశారు ఈ ఇద్దరు హీరోలు.

సినిమాలో దాస్ (నాని) ఓ మిడిల్ క్లాస్ డాక్టర్. టాలెంట్ కాస్త ఉన్నోడే. కానీ పర్సనల్ గా కలిగిన ఓ ఇబ్బంది వల్ల ప్రాక్టీస్ కు దూరమౌతాడు. సరిగ్గా అలాంటి టైమ్ లోనే ఊహించని, అనుకోని అతిథి దాస్ జీవితంలోకి ప్రవేశిస్తాడు. అతడే దేవ (నాగార్జున). దేవ ఓ చిన్నసైజ్ డాన్. ఇతడు చెప్పిందే వేదం. చేతిలో ఎప్పుడూ గన్ ఉంటుంది.

ఇలాంటి ఇద్దరు భిన్న నేపథ్యాలు ఉన్న వ్యక్తులు అనుకోని పరిస్థితుల్లో కలుసుకుంటారు. ఈ క్రమంలో ఒకరి బాధలు ఒకరు చెప్పుకుంటారు. ఒకరి కష్టం మరొకరికి చిన్నదిగా అనిపిస్తుంది. కేవలం చిన్నదిగా ఫీల్ అవ్వడమే కాకుండా, ఒకరి కష్టాల్ని మరొకరు తీరుస్తారు.

దేవకు చిన్నప్పట్నుంచి ఓ అమ్మాయి (ఆకాంక్ష) అంటే ఇష్టం. ఆమె న్యూస్ రీడర్. కానీ తన ప్రేమను చెప్పలేకపోతాడు. ఈలోగా అనుకోని కారణాల వల్ల రెబల్ గా మారతాడు. వీళ్లిద్దర్నీ దాస్ కలుపుతాడు. ఇక దాస్ కు కూడా ఓ లవ్ స్టోరీ ఉంటుంది. రష్మికతో చిన్న ప్రాబ్లమ్ వస్తుంది. ఈ సమస్యను దేవా తీరుస్తాడు. ఇదే సింపుల్ గా దేవదాస్ స్టోరీలైన్. సినిమా విడుదలకు ముందే ఈ విషయాన్ని ఈ హీరోలిద్దరూ తమకు తెలియకుండానే బయటపెట్టేశారు.

First Published:  25 Sep 2018 9:32 AM GMT
Next Story