Telugu Global
NEWS

మారుతీరావుకు సంఘీభావంగా మరో ర్యాలీ

మిర్యాలగూడ ప్రణయ్‌ హత్య కేసులో నిందితుడిగా ఉన్న మారుతీరావుకు అండగా పలువురు గళం విప్పుతున్నారు. హత్యను ఖండిస్తూనే అందుకు దారి తీసిన పరిస్థితులను కూడా గమనించాలంటున్నారు. మారుతీరావుకు సంఘీభావంగా ర్యాలీలు మొదలయ్యాయి. ఆదివారం మిర్యాలగూడలో ర్యాలీ నిర్వహించారు. తాజాగా నల్లగొండలో ఆడపిల్లల తల్లిదండ్రుల సంఘం ర్యాలీ జరిగింది. మిర్యాలగూడలో ప్రణయ్ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు కొందరు ప్రయత్నించడంతో వ్యవహారం మరో మలుపు తిరిగింది. ప్రణయ్ విగ్రహ ఏర్పాటును అడ్డుకునేందుకు మిర్యాలగూడలోని పలు వర్గాల వారు సిద్ధమయ్యారు. ఏం […]

మారుతీరావుకు సంఘీభావంగా మరో ర్యాలీ
X

మిర్యాలగూడ ప్రణయ్‌ హత్య కేసులో నిందితుడిగా ఉన్న మారుతీరావుకు అండగా పలువురు గళం విప్పుతున్నారు. హత్యను ఖండిస్తూనే అందుకు దారి తీసిన పరిస్థితులను కూడా గమనించాలంటున్నారు. మారుతీరావుకు సంఘీభావంగా ర్యాలీలు మొదలయ్యాయి. ఆదివారం మిర్యాలగూడలో ర్యాలీ నిర్వహించారు. తాజాగా నల్లగొండలో ఆడపిల్లల తల్లిదండ్రుల సంఘం ర్యాలీ జరిగింది.

మిర్యాలగూడలో ప్రణయ్ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు కొందరు ప్రయత్నించడంతో వ్యవహారం మరో మలుపు తిరిగింది. ప్రణయ్ విగ్రహ ఏర్పాటును అడ్డుకునేందుకు మిర్యాలగూడలోని పలు వర్గాల వారు సిద్ధమయ్యారు. ఏం సాధించాడని ప్రణయ్ విగ్రహం ఏర్పాటు చేస్తున్నారని పలువురు ప్రశ్నించారు.

స్థానిక మినీ రవీంద్రభారతిలో అమ్మాయిల తల్లిదండ్రుల సంఘం సమావేశం కూడా నిర్వహించింది. అమ్మాయిలను అకతాయిల నుంచి కాపాడుకోవడం ఎలా అన్నదానిపై వారు చర్చించారు. అనంతరం మిర్యాలగూడ పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. డీఎస్పీని, రెవెన్యూ అధికారులను కలిసి ప్రణయ్ విగ్రహ ఏర్పాటును అడ్డుకోవాలని వినతిపత్రం ఇచ్చారు.

నల్లగొండలో మారుతీరావుకు సంఘీభావంగా ర్యాలీ నిర్వహించిన ఆర్యవైశ్య సంఘం, తల్లిదండ్రుల పరిరక్షణ వేదిక

మరోవైపు నల్లగొండలోనూ మారుతీరావుకు సంఘీభావంగా ర్యాలీ నిర్వహించారు. వాసవీభవన్ నుంచి జైలు వరకు ర్యాలీ నిర్వహించారు. ఆర్యవైశ్య సంఘంతో పాటు వివిధ వర్గాలతో కూడిన తల్లిదండ్రుల పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఆడపిల్లలకు రక్షణ కల్పించాలని వారు కోరారు. జైలు వరకు వెళ్లి జైల్లో ఉన్న మారుతీరావు, ఆయన సోదరుడు శ్రవణ్‌తో ములాకత్ అయ్యారు. మారుతీరావుకు తల్లిదండ్రుల పరిరక్షణ వేదిక సంఘీభావం తెలిపింది.

అనంతరం జైలు నుంచి జిల్లా కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. కలెక్టర్, ఎస్పీని కలిసి మిర్యాలగూడలో ప్రణయ్ విగ్రహ ఏర్పాటుకు అనుమతి ఇవ్వొద్దని కోరారు. ప్రణయ్‌ విగ్రహాన్ని చూసి పిల్లలు ఆయన చేసిన ఘనకార్యం ఏమిటి అని అడిగితే ఏం చెప్పాలని తల్లిదండ్రుల పరిరక్షణ వేదిక ప్రశ్నించింది. ఇలాంటి చర్యల వల్ల అమ్మాయిలపై ఆకతాయిలను ప్రోత్సహించినట్టు అవుతుందని వారు అధికారులకు విన్నవించుకున్నారు.

First Published:  24 Sep 2018 11:40 PM GMT
Next Story