Telugu Global
NEWS

జైపాల్‌రెడ్డి క్లారిటీ ఇవ్వడం వెనుక కారణం అదేనా?

కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి ఓ క్లారిటీ ఇచ్చారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో తాను మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ ఎమ్మెల్యేగా పోటీ చేయ‌డం లేద‌ని ప్ర‌క‌టించారు. తాను పాల‌మూరు ఎంపీగానే పోటీ చేస్తాన‌ని స్ప‌ష్టం చేశారు. కొన్ని రోజుల కింద‌ట మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ ఎమ్మెల్యేగా జైపాల్‌రెడ్డి పోటీ చేస్తార‌ని కొన్ని వార్త‌లు విన్పించాయి. సీఎం రేసులో జైపాల్ ఉంటార‌ని గుస‌గుస‌లు మొద‌ల‌య్యాయి. దీంతో జైపాల్ రెడ్డి ఓ ప్రెస్‌నోట్ విడుద‌ల చేశారు. తాను ఎమ్మెల్యేగా పోటీ చేయ‌డం లేద‌ని చెప్పుకొచ్చారు. తాను ఎంపీగా […]

జైపాల్‌రెడ్డి  క్లారిటీ ఇవ్వడం వెనుక కారణం అదేనా?
X

కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి ఓ క్లారిటీ ఇచ్చారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో తాను మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ ఎమ్మెల్యేగా పోటీ చేయ‌డం లేద‌ని ప్ర‌క‌టించారు. తాను పాల‌మూరు ఎంపీగానే పోటీ చేస్తాన‌ని స్ప‌ష్టం చేశారు. కొన్ని రోజుల కింద‌ట మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ ఎమ్మెల్యేగా జైపాల్‌రెడ్డి పోటీ చేస్తార‌ని కొన్ని వార్త‌లు విన్పించాయి. సీఎం రేసులో జైపాల్ ఉంటార‌ని గుస‌గుస‌లు మొద‌ల‌య్యాయి. దీంతో జైపాల్ రెడ్డి ఓ ప్రెస్‌నోట్ విడుద‌ల చేశారు.

తాను ఎమ్మెల్యేగా పోటీ చేయ‌డం లేద‌ని చెప్పుకొచ్చారు. తాను ఎంపీగా మాత్ర‌మే బ‌రిలో ఉంటానని స్పష్టం చేశారు. అయితే జైపాల్‌రెడ్డి ఈ క్లారిటీ ఎందుకు ఇచ్చార‌నే విష‌యం ఇప్పుడు ఒక చ‌ర్చనీయాంశంగా మారింది.

డీకే అరుణ, జైపాల్‌రెడ్డి వ‌ర్గాల మ‌ధ్య కొన్నాళ్లుగా ఆధిప‌త్య పోరు న‌డుస్తోంది. జైపాల్‌ రెడ్డి మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ నుంచి పోటీ చేస్తార‌నే వార్తను డీకే వ‌ర్గం వ‌దిలింద‌ని జైపాల్‌రెడ్డి అనుమానం.

జైపాల్ రెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేస్తార‌ని చెప్పి… ఆయ‌న వ్య‌తిరేకుల‌ను ఒక‌టి చేయాల‌ని కొంద‌రు ప్లాన్ చేశార‌ట‌. అంతేకాకుండా రాష్ట్ర రాజకీయాల్లో వేలుపెట్ట‌ద‌లుచుకో కూడదని నిర్ణ‌యించుకున్న జైపాల్‌రెడ్డి ఈ నిర్ణ‌యం తీసుకున్నార‌ని తెలుస్తోంది.

మ‌రోవైపు పొత్తుల్లో భాగంగా మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ సీటు టీజేఎస్ లేదా టీడీపీ లేదా తెలంగాణ ఇంటి పార్టీకి ఇవ్వొచ్చ‌నే ఒక ప్ర‌చారం ఉంది. దీంతో సీటు విష‌యంలో గొడ‌వ ఎందుకని త‌లిచిన జైపాల్‌రెడ్డి ఈ క్లారిటీ ఇచ్చార‌ని తెలుస్తోంది.

First Published:  24 Sep 2018 10:35 PM GMT
Next Story