Telugu Global
Cinema & Entertainment

"సై రా" లో రాయ్‌ ల‌క్ష్మీ ?

మెగా స్టార్ చిరంజీవి తో “రత్తాలు రత్తాలు” అనే ఐటెం సాంగ్ లో డాన్స్ చేసింది రాయ్‌ ల‌క్ష్మీ. ఆ త‌ర్వాత మెగాస్టార్ చిరంజీవి గురించి చాలా ఇంట‌ర్వ్యూల్లో ఎంతో జోష్‌తో ఉంటార‌ని పొగిడేసింది రాయ్‌ ల‌క్ష్మీ. ప్ర‌స్తుతం ఈ భామ తెలుగు లో “వేర్ ఈజ్ వెంక‌ట‌ల‌క్ష్మి” చిత్రంలో న‌టిస్తోంది. తాజా షెడ్యూల్ ప్ర‌స్తుతం హైద‌రాబాద్‌లో పూర్త‌యింది. దీంతో హైదరాబాద్ లో ఉన్న ఈ భామ ఇటివలే చిరంజీవిని కలిసింది. చిరుతో పాటు సుశ్మిత‌, సురేఖల‌తో […]

సై రా లో రాయ్‌ ల‌క్ష్మీ ?
X

మెగా స్టార్ చిరంజీవి తో “రత్తాలు రత్తాలు” అనే ఐటెం సాంగ్ లో డాన్స్ చేసింది రాయ్‌ ల‌క్ష్మీ. ఆ త‌ర్వాత మెగాస్టార్ చిరంజీవి గురించి చాలా ఇంట‌ర్వ్యూల్లో ఎంతో జోష్‌తో ఉంటార‌ని పొగిడేసింది రాయ్‌ ల‌క్ష్మీ. ప్ర‌స్తుతం ఈ భామ తెలుగు లో “వేర్ ఈజ్ వెంక‌ట‌ల‌క్ష్మి” చిత్రంలో న‌టిస్తోంది. తాజా షెడ్యూల్ ప్ర‌స్తుతం హైద‌రాబాద్‌లో పూర్త‌యింది. దీంతో హైదరాబాద్ లో ఉన్న ఈ భామ ఇటివలే చిరంజీవిని కలిసింది.

చిరుతో పాటు సుశ్మిత‌, సురేఖల‌తో ర‌త్తాలు ఓ ఫోటో దిగి తన సోషల్ మీడియా అకౌంట్స్ లో షేర్ చేసింది ఈ భామ. ఈ సంద‌ర్భంగా మెగా ఫ్యామిలీతో క‌లిసినందుకు చాలా సంతోషంగా ఉంద‌ని రాయ్‌ ల‌క్ష్మీ అంది. అయితే ర‌త్తాలు మెగా స్టార్ తో ర్యాపో బాగానే మెయింటెయిన్ చేస్తోంది అని అర్ధం అవుతుంది. మ‌ళ్లీ బాస్ స‌ర‌స‌న “సైరా”లో ఛాన్స్ కోసమే రాయ్‌ ల‌క్ష్మీ ఇదంతా చేస్తుంది అని కొంత మంది అంటున్నారు. మరి ఇప్పటికే భారీ తారలు నటిస్తున్న “సై రా” లో రాయ్‌ ల‌క్ష్మీ కి చిరంజీవి అవకాశం ఇస్తాడో లేదో చూడాలి.

First Published:  24 Sep 2018 11:16 PM GMT
Next Story