Telugu Global
NEWS

బాబు మంత్రులు చేతులెత్తేసినట్టేనా...?

సాధారణంగా ఏదైనా ప్రభుత్వంపై ఏవైనా విమర్శలు వస్తే.. అందులో భాగమైన మంత్రులు స్పందించడం పరిపాటి. వివిధ శాఖలమయమైన ప్రభుత్వంపై విమర్శలు వచ్చినా, ముఖ్యమంత్రిపై తీవ్రమైన ఆరోపణలు వచ్చినా.. ప్రతిపక్షాల నుంచి ఈ తరహా దాడి ఎదురైతే ముందుగా స్పందిచేది మంత్రులే. అలాగే అధికార పార్టీ నేతలు కూడా స్పందిస్తూ ఉంటారు. తెలుగుదేశం పార్టీలో ఇందుకు కాస్త భిన్నమైన స్థితి కొనసాగుతూ ఉంది. చంద్రబాబు పాలనపై రకరకాల ఆరోపణలకు కొదువ లేకపోగా.. బాబుపై వచ్చే విమర్శలకు ధాటిగా బదులిచ్చే వారు […]

బాబు మంత్రులు చేతులెత్తేసినట్టేనా...?
X

సాధారణంగా ఏదైనా ప్రభుత్వంపై ఏవైనా విమర్శలు వస్తే.. అందులో భాగమైన మంత్రులు స్పందించడం పరిపాటి. వివిధ శాఖలమయమైన ప్రభుత్వంపై విమర్శలు వచ్చినా, ముఖ్యమంత్రిపై తీవ్రమైన ఆరోపణలు వచ్చినా.. ప్రతిపక్షాల నుంచి ఈ తరహా దాడి ఎదురైతే ముందుగా స్పందిచేది మంత్రులే. అలాగే అధికార పార్టీ నేతలు కూడా స్పందిస్తూ ఉంటారు.

తెలుగుదేశం పార్టీలో ఇందుకు కాస్త భిన్నమైన స్థితి కొనసాగుతూ ఉంది. చంద్రబాబు పాలనపై రకరకాల ఆరోపణలకు కొదువ లేకపోగా.. బాబుపై వచ్చే విమర్శలకు ధాటిగా బదులిచ్చే వారు మాత్రం తగ్గిపోతూ ఉన్నారు. అధికార పార్టీలోని కొంతమంది మాట్లాడతారు కానీ.. వాళ్లవి అడ్డగోలు మాటలే. అర్థవంతమైన, విమర్శలు తిప్పి కొట్టగలిగేలా ఎవ్వరూ మాట్లాడటం లేదు.

ఇక ఈ మధ్య కాలంలో అన్నింటికీ కుటుంబరావే దిక్కు అవుతున్నాడు. చంద్రబాబు ప్రభుత్వంపై ఏ విషయంలో విమర్శలు వచ్చినా స్పందిస్తున్నది కుటుంబరావు మాత్రమే. ఈయన హోదా సామాన్యులకు అర్థమయ్యేది కాదు కానీ…ఈయన చిత్రవిచిత్రంగా స్పందిస్తూ వస్తున్నాడు. ప్రభుత్వంలోని వివిధ శాఖలపై, వివిధ కార్యక్రమాల అమలుపై విమర్శలు వస్తుంటే.. వాటన్నింటికీ కుటుంబరావే సమాధానం చెబుతున్నాడు ముఖ్యమంత్రి తరహాలో. అది ఆయనకు సంబంధం లేని వ్యవహారం అయినా కుటుంబరావే మాట్లాడుతున్నాడు.

ఈయన అసలు మంత్రి కాదు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కాదు, ముఖ్యమంత్రి అస్సలే కాదు. ప్రజల నుంచి ఎన్నకోబడిన వ్యక్తి కాదు. అయినా అన్నింటికీ రియాక్ట్ అవుతున్నాడు. మంత్రులు బాధ్యతారాహిత్యంతో ఉన్నారని అనుకోవాలా లేక, ఈ తలనొప్పులతో తమకు సంబంధం లేదని వాళ్లంతా తప్పుకున్నారా? బాబు ప్రభుత్వంలో ఏం జరుగుతోంది?

First Published:  25 Sep 2018 11:48 AM GMT
Next Story