Telugu Global
Cinema & Entertainment

మలయాళం సినిమాలో వెంకటేష్

విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం తెలుగు లో మెగా హీరో వరుణ్ తేజ్ తో “ఎఫ్ 2” సినిమాలో నటిస్తున్నాడు. పూర్తి స్థాయి కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాని అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమాతో పాటు నాగ చైతన్య తో కలిసి “వెంకీ మామ” అనే సినిమాలో కూడా నటిస్తున్నాడు వెంకటేష్. బాబీ డైరెక్ట్ చేయబోతున్న ఈ సినిమా యొక్క షూటింగ్ త్వరలో స్టార్ట్ కానుంది. ఈ రెండు కాకుండా విక్టరీ వెంకటేష్ […]

మలయాళం సినిమాలో వెంకటేష్
X

విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం తెలుగు లో మెగా హీరో వరుణ్ తేజ్ తో “ఎఫ్ 2” సినిమాలో నటిస్తున్నాడు. పూర్తి స్థాయి కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాని అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమాతో పాటు నాగ చైతన్య తో కలిసి “వెంకీ మామ” అనే సినిమాలో కూడా నటిస్తున్నాడు వెంకటేష్. బాబీ డైరెక్ట్ చేయబోతున్న ఈ సినిమా యొక్క షూటింగ్ త్వరలో స్టార్ట్ కానుంది. ఈ రెండు కాకుండా విక్టరీ వెంకటేష్ ఇటివలే ఒక మలయాళం సినిమా ఓకే చేసినట్టు ఫిలిం నగర్ టాక్.

మలయాళం నుంచి ఒక దర్శకుడు వచ్చి వెంకీ కి కథ చెప్పి ఓకే చేపించాడట. ఈ సినిమాలో వెంకటేష్ ఆర్మీ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. వెంకటేష్ తో పాటు మరొక మలయాళ స్టార్ ఈ సినిమాలో హీరోగా నటించబోతున్నాడు. వెంకటేష్ మలయాళ ఇండస్ట్రీ అంటే చాలా గౌరవం అలాగే అక్కడ వెంకీ కి చాలా మంది స్నేహితులు ఉన్నారు. అందుకే కథ నచ్చగానే మరో మాట చెప్పకుండా వెంకీ ఓకే చెప్పాడు అని తెలుస్తుంది. విక్టరీ వెంకటేష్ కథలు ఎంచుకునే పద్ధతి చూస్తుంటే ఇక మీదట కమర్షియల్ కథలకి ఓకే చెప్పేలా లేడు అని అర్ధం అవుతుంది.

First Published:  24 Sep 2018 7:36 AM GMT
Next Story