Telugu Global
NEWS

ఆలూ లేదు.... చూలు లేదు.... అప్పుడే గోతులు

తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ నేతలే ధైర్యంగా చెప్పలేని పరిస్థితి. అందుకే అన్నీ విడిచి టీడీపీతోనూ పొత్తుకు సిద్దమైంది కాంగ్రెస్. ఇతర పార్టీలను కలుపుకుంటోంది. పొత్తుల్లోనే చాలా సీట్లు పోతాయని తెలిసినా కాంగ్రెస్‌ మరో గత్యంతరం లేదన్నట్టు టీ కాంగ్రెస్‌ పనిచేస్తోంది. ఎంట్రీలో బాహుబలిగా తనకు తాను భ్రమించి కాంగ్రెస్‌లో చేరిన రేవంత్ రెడ్డి ఆ తర్వాత రవ్వంత రెడ్డిగానే మిగిలిపోయారు. అవకాశం ఇవ్వండి పొడిచేస్తా అని రేవంత్ రెడ్డి ప్రకటనలు ఇస్తున్నా.. కూల్‌ […]

ఆలూ లేదు....  చూలు లేదు....  అప్పుడే గోతులు
X

తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ నేతలే ధైర్యంగా చెప్పలేని పరిస్థితి. అందుకే అన్నీ విడిచి టీడీపీతోనూ పొత్తుకు సిద్దమైంది కాంగ్రెస్. ఇతర పార్టీలను కలుపుకుంటోంది. పొత్తుల్లోనే చాలా సీట్లు పోతాయని తెలిసినా కాంగ్రెస్‌ మరో గత్యంతరం లేదన్నట్టు టీ కాంగ్రెస్‌ పనిచేస్తోంది.

ఎంట్రీలో బాహుబలిగా తనకు తాను భ్రమించి కాంగ్రెస్‌లో చేరిన రేవంత్ రెడ్డి ఆ తర్వాత రవ్వంత రెడ్డిగానే మిగిలిపోయారు. అవకాశం ఇవ్వండి పొడిచేస్తా అని రేవంత్ రెడ్డి ప్రకటనలు ఇస్తున్నా.. కూల్‌ బాబు.. కూల్ అంటూ వెనక్కు లాగేస్తున్నారు ముదురు కాంగ్రెస్ నేతలు.

ఏకంగా పీసీసీ చీఫ్ పోస్టునే రేవంత్ రెడ్డి ఆశించగా… వర్కింగ్ ప్రెసిడెంట్‌తో సరిపెట్టింది కాంగ్రెస్. ఇలా తనకు పీసీసీ అధ్యక్ష పదవి రాకుండా అడ్డుకున్నది ఉత్తమ్ కుమార్‌ రెడ్డేనని మొన్ననే పార్టీలో చేరిన రేవంత్ రెడ్డి బలంగా నమ్ముతున్నారట. ఇలా తన అవకాశాన్ని దెబ్బతీసిన ఉత్తమ్‌ పైనా ప్రతికారంతో రేవంత్ రెడ్డి రగిలిపోతున్నారని చెబుతున్నారు.

ఇందులో భాగంగానే ఒకవేళ తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి కావాలనుకుంటున్న ఉత్తమ్‌ కుమార్ రెడ్డి ఆలోచనకు గండికొట్టేందుకు రేవంత్ రెడ్డి కొత్త పాట పాడుతున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దళితుడిని ముఖ్యమంత్రి చేయాలని ఆయన ప్రతిపాదిస్తున్నారు.

ఎప్పటికైనా తెలంగాణకు ముఖ్యమంత్రి కావడమే తన లక్ష్యమని చెప్పుకునే రేవంత్ రెడ్డి ఇప్పుడు హఠాత్తుగా ఇలా దళితుడిని సీఎం చేయాలని మాట్లాడడం కాంగ్రెస్‌లో చర్చనీయాంశమైంది. తనకు ఎలాగో కాంగ్రెస్‌లో సీఎం అయ్యే అవకాశం లేదని గ్రహించిన రేవంత్ రెడ్డి… తన అవకాశాలను దెబ్బతీసిన కాంగ్రెస్ నేతల ముఖ్యమంత్రి కల నెరవేరకుండా చేసేందుకు దళిత ముఖ్యమంత్రి కార్డును వాడుతున్నారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.

First Published:  24 Sep 2018 3:40 AM GMT
Next Story