Telugu Global
Cinema & Entertainment

మరో సినిమా పూర్తిచేసిన రవితేజ

మూవీని సెట్స్ పైకి తీసుకురావడమే ఆలస్యం, మొత్తం షూటింగ్ పూర్తయ్యేవరకు గ్యాప్ లేకుండా పనిచేయడం రవితేజ స్టయిల్. ఇప్పుడు కూడా మాస్ రాజా అదే పనిచేశాడు. అమర్ అక్బర్ ఆంటోనీ సినిమాను పూర్తిచేశాడు. శ్రీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి అన్నపూర్ణ స్టుడియోస్ లో ఓ సాంగ్ షూట్ చేశారు. ఈ పాటతో టోటల్ సినిమా షూటింగ్ కంప్లీట్ అయినట్టు మేకర్స్ ప్రకటించారు. అంతేకాదు, రవితేజ 3 గెటప్స్ తో ఓ చిన్నపాటి వీడియోను కూడా […]

మరో సినిమా పూర్తిచేసిన రవితేజ
X

మూవీని సెట్స్ పైకి తీసుకురావడమే ఆలస్యం, మొత్తం షూటింగ్ పూర్తయ్యేవరకు గ్యాప్ లేకుండా పనిచేయడం రవితేజ స్టయిల్. ఇప్పుడు కూడా మాస్ రాజా అదే పనిచేశాడు. అమర్ అక్బర్ ఆంటోనీ సినిమాను పూర్తిచేశాడు. శ్రీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి అన్నపూర్ణ స్టుడియోస్ లో ఓ సాంగ్ షూట్ చేశారు. ఈ పాటతో టోటల్ సినిమా షూటింగ్ కంప్లీట్ అయినట్టు మేకర్స్ ప్రకటించారు. అంతేకాదు, రవితేజ 3 గెటప్స్ తో ఓ చిన్నపాటి వీడియోను కూడా విడుదల చేశారు.

ఈ సినిమాపై శ్రీనువైట్ల చాలా ఆశలుపెట్టుకున్నాడు. వరుసగా ఫ్లాప్స్ ఇస్తున్న ఈ దర్శకుడు, ఈసారి తన ట్రేడ్ మార్క్ కామెడీని పక్కనపెట్టి, కంప్లీట్ యాక్షన్ సబ్జెక్ట్ ఎంచుకున్నాడు. అంతేకాదు, ఈ సినిమాపై హీరోయిన్ ఇలియానా కూడా చాలా హోప్స్ పెట్టుకుంది. ఎందుకంటే ఆమెకిది తెలుగులో రీఎంట్రీ. అటు మరో సీనియర్ హీరోయిన్ లయ కూడా ఈ సినిమాతో టాలీవుడ్ లో రీఎంట్రీ ఇస్తోంది.

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నాడు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఓ కొలిక్కి వచ్చిన వెంటనే సినిమా విడుదల తేదీని అధికారికంగా ప్రకటిస్తారు. రవితేజ త్రిపాత్రాభినయం చేయడం ఇదే తొలిసారి.

First Published:  24 Sep 2018 8:04 AM GMT
Next Story