Telugu Global
Cinema & Entertainment

విడుదలకు ముందే దేవదాస్ కు లాభాలు

నాగార్జున, నాని హీరోలుగా నటించిన దేవదాస్ సినిమాకు సంబంధించి ఒకేసారి అన్ని రకాల ప్రీ-రిలీజ్ బిజినెస్ లు పూర్తయ్యాయి. ఇప్పటికే ఈ సినిమాను అవుట్-రేట్ కు వయకామ్ సంస్థకు అమ్మేశారు. తాజాగా దేవదాస్ శాటిలైట్ డీల్ కూడా పూర్తయింది. జీ తెలుగు ఎంటర్ టైన్ మెంట్ ఛానెల్ దేవదాస్ శాటిలైట్ రైట్స్ ను దక్కించుకుంది. డిజిటల్, డబ్బింగ్ తో కలుపుకొని ఈ సినిమా హక్కుల్ని 15 కోట్ల రూపాయలకు దక్కించుకుంది సదరు సంస్థ. మల్టీస్టారర్ కావడం, డబ్బింగ్ […]

విడుదలకు ముందే దేవదాస్ కు లాభాలు
X
నాగార్జున, నాని హీరోలుగా నటించిన దేవదాస్ సినిమాకు సంబంధించి ఒకేసారి అన్ని రకాల ప్రీ-రిలీజ్ బిజినెస్ లు పూర్తయ్యాయి. ఇప్పటికే ఈ సినిమాను అవుట్-రేట్ కు వయకామ్ సంస్థకు అమ్మేశారు. తాజాగా దేవదాస్ శాటిలైట్ డీల్ కూడా పూర్తయింది.
జీ తెలుగు ఎంటర్ టైన్ మెంట్ ఛానెల్ దేవదాస్ శాటిలైట్ రైట్స్ ను దక్కించుకుంది. డిజిటల్, డబ్బింగ్ తో కలుపుకొని ఈ సినిమా హక్కుల్ని 15 కోట్ల రూపాయలకు దక్కించుకుంది సదరు సంస్థ. మల్టీస్టారర్ కావడం, డబ్బింగ్ రైట్స్ కూడా కలిపి ఉండడంతో కాస్త భారీ మొత్తానికే ఈ సినిమా రైట్స్ అమ్ముడుపోయాయని చెప్పుకోవాలి. నిజానికి ఈ సినిమా బడ్జెట్ ఇంతకంటే కాస్త తక్కువే. సో.. తాజా డీల్ తో కంపేర్ చేసి చూస్తే.. విడుదలకు ముందే దేవదాస్ సినిమా లాభాలు కళ్లజూసినట్టు లెక్క.
మరోవైపు ఈ సినిమాకు అటు నాగ్, ఇటు నాని వినూత్నంగా ప్రచారం చేస్తున్నారు. సంప్రదాయబద్ధంగా జరిగే ఇంటర్వ్యూలు, ప్రెస్ మీట్స్ తో పాటు ఈ ఇద్దరు హీరోలు కలిసి సోషల్ మీడియాలో తెగ హంగామా చేస్తున్నారు. గురువారం ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. శ్రీరామ్ ఆదిత్య డైరక్ట్ చేసిన ఈ సినిమాను వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అశ్వనీదత్ నిర్మించాడు.
First Published:  24 Sep 2018 7:44 AM GMT
Next Story