Telugu Global
NEWS

బాబు పాలనకు ఇది మరో నిదర్శనం!

తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు పాలనకు ఇది మరో వెక్కిరింపు అని చెప్పవచ్చు. చంద్రబాబు పాలన ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవడానికి ఇది మరో ఉదాహరణ. ఇప్పటికే బాబుగారి వైఫల్యాలకు కొదవలేదు. ఒక విషయంలో అని కాదు.. ప్రతి విషయంలోనూ చంద్రబాబు నాయుడు పాలన పరంపర అత్యంత అధ్వాన్నంగానే ఉంది కానీ.. అంతకు మించి చెప్పకోవడానికి లేదు. మాటెత్తితే రాజకీయాల్లో తను సీనియర్ ని అని, దేశంలో అత్యంత సీనియర్ రాజకీయ నాయకుడిని అని…. తనకు […]

బాబు పాలనకు ఇది మరో నిదర్శనం!
X

తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు పాలనకు ఇది మరో వెక్కిరింపు అని చెప్పవచ్చు. చంద్రబాబు పాలన ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవడానికి ఇది మరో ఉదాహరణ. ఇప్పటికే బాబుగారి వైఫల్యాలకు కొదవలేదు. ఒక విషయంలో అని కాదు.. ప్రతి విషయంలోనూ చంద్రబాబు నాయుడు పాలన పరంపర అత్యంత అధ్వాన్నంగానే ఉంది కానీ.. అంతకు మించి చెప్పకోవడానికి లేదు.

మాటెత్తితే రాజకీయాల్లో తను సీనియర్ ని అని, దేశంలో అత్యంత సీనియర్ రాజకీయ నాయకుడిని అని…. తనకు మించిన సీనియర్ లేడని చంద్రబాబు నాయుడు చెప్పుకుంటూ ఉంటాడు. ఇలా చెప్పుకోవడమే కానీ…. బాబు గారి పాలనలో చెప్పుకోవడానికి ఏమీ లేకుండా పోయింది.

ఇక తాజాగా మావోలు రెచ్చిపోవడం చంద్రబాబు నాయుడు పాలనలోని మరో వైఫల్యం. అసలు ఏపీలో మావోల ఉనికి ఉందా? అనేది సందేహంగా ఉండిన ప్రశ్న. అయితే…. చంద్రబాబు పాలనలో శాంతిభద్రతలు అత్యంత క్షీణావస్థకు చేరుకున్నాయి. అందుకు నిదర్శనమే ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు హత్య.

ఒక ఎమ్మెల్యేను చంపడం ఇంత సులభమా? అన్నట్టుగా మావోలు రెచ్చిపోయారు. ఎమ్మెల్యేను, మాజీ ఎమ్మెల్యేను అత్యంత దారుణంగా చంపేశారు. అది కూడా ఒక మండల కేంద్ర సమీపంలో ఈ హత్య జరిగింది. భారీ సంఖ్యలో మావోలు ఈ హత్యాకాండలో పాల్గొన్నట్టుగా స్పష్టం అవుతోంది. అంతమంది మావోలు ఒక మండల కేంద్రానికి వచ్చారంటే…. పోలీసులు ఏం చేస్తున్నారు? ప్రభుత్వం ఏం చేస్తోంది? అనేది ప్రశ్న.

అయితే… చంద్రబాబు పాలనలో పోలీసులు ఉన్నది కేవలం ప్రతిపక్షంలోని వారిని వేధించడానికి, అనైతిక కార్యకలాపాలకు తప్ప…. ప్రజలకు రక్షణ కల్పించడానికి కాదనేది స్పష్టం అవుతుందని ప్రతిపక్ష నాయకులు అంటున్నారు. ఇలాంటి తరుణంలో ఏకంగా ఎమ్మెల్యేకు కూడా వారు అండగా నిలవలేకపోయారు. బాబు పాలన పటిమ ఎలా ఉందో అర్థం చేసుకోవడానికి ఇది మరో ఉదాహరణ.

First Published:  24 Sep 2018 3:30 AM GMT
Next Story