Telugu Global
NEWS

లిస్ట్‌లో చంద్రబాబు ఈవెంట్‌ లేదా?

చంద్రబాబు అమెరికా పర్యటనపై అనుమానాలు వీడడం లేదు. తనను వ్యవసాయంపై ప్రసంగించాల్సిందిగా ఐక్యరాజ్యసమితి ఆహ్వానించిందని చంద్రబాబు ప్రచారం చేసుకున్నారు. అయితే చంద్రబాబే సొంత ఖర్చుతో ఆమెరికా వెళ్లినట్టు ఆతర్వాత వెల్లడైంది. బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు మరో కొత్త అనుమానం తెరపైకి తెచ్చారు. ట్విట్టర్లో చంద్రబాబు టూర్‌పై స్పందించిన జీవీఎల్… అసలు చంద్రబాబు ప్రసంగిస్తారన్న అంశం…. కార్యక్రమాల షెడ్యూల్‌లోనే లేదని వెల్లడించారు. యూఎన్ జీఏ సమావేశాల సందర్భంగా నిర్వహిస్తున్న 313 అనుబంధ ఈవెంట్లలో చంద్రబాబు ప్రసంగిస్తారని చెబుతున్న […]

లిస్ట్‌లో చంద్రబాబు ఈవెంట్‌ లేదా?
X

చంద్రబాబు అమెరికా పర్యటనపై అనుమానాలు వీడడం లేదు. తనను వ్యవసాయంపై ప్రసంగించాల్సిందిగా ఐక్యరాజ్యసమితి ఆహ్వానించిందని చంద్రబాబు ప్రచారం చేసుకున్నారు. అయితే చంద్రబాబే సొంత ఖర్చుతో ఆమెరికా వెళ్లినట్టు ఆతర్వాత వెల్లడైంది.

బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు మరో కొత్త అనుమానం తెరపైకి తెచ్చారు. ట్విట్టర్లో చంద్రబాబు టూర్‌పై స్పందించిన జీవీఎల్… అసలు చంద్రబాబు ప్రసంగిస్తారన్న అంశం…. కార్యక్రమాల షెడ్యూల్‌లోనే లేదని వెల్లడించారు. యూఎన్ జీఏ సమావేశాల సందర్భంగా నిర్వహిస్తున్న 313 అనుబంధ ఈవెంట్లలో చంద్రబాబు ప్రసంగిస్తారని చెబుతున్న ఈవెంటే లేదని… కావాలంటే చూసుకోవాలంటూ వెబ్‌సైట్‌ లింక్‌ను షేర్‌ చేశారు.

చంద్రబాబు ప్రసంగిస్తారని టీడీపీ మీడియా ప్రచారం చేసిన ‘సుస్థిర వ్యవసాయాభివృద్ధిలో ప్రపంచంలో ఎదురువుతున్న సవాళ్లు’అంశానికి సంబంధించిన వివరణే లేదని… ఒకవేళ టీడీపీ నేతలకు ఆ అంశానికి సంబంధించి లింక్ దొరికితే కాస్త చూపించాలని ట్వీట్ చేశారు. ఇంతకు ”మన గ్లోబల్ లీడర్” ఏ సదస్సులో మాట్లాడుతున్నారు అని జీవీఎల్ ప్రశ్నించారు.

First Published:  24 Sep 2018 4:29 AM GMT
Next Story