నగరాల్లో పెరుగుతున్న టీనేజర్ల అబార్షన్లు!
నగరాల్లో అబార్షన్లు చేయించుకుంటున్నటీనేజి అమ్మాయిల సంఖ్య రానురాను పెరుగుతున్నదని ఒక ప్రభుత్వ ఆరోగ్య సర్వే వెల్లడించింది. నగరాల్లో పెరుగుతున్న స్వేచ్ఛా వాతావరణం ఇందుకు ఒక ముఖ్యకారణమని ఎన్ఎస్ఎస్ఓ (నేషనల్ శాంపిల్ సర్వే ఆర్గనైజేషన్) సర్వే పేర్కొంది. నమోదు అవుతున్న మొత్తం గర్భధారణల్లో నగరాల్లో 74శాతం, గ్రామాల్లో 77శాతం వరకు బిడ్డలు సురక్షితంగా జన్మిస్తున్నారని, నగరాల్లో 3శాతం, గ్రామాల్లో 2శాతం అబార్షన్లు ఉంటున్నాయని సర్వే తెలిపింది. అయితే నగరాల్లో అబార్షన్లు చేయించుకుంటున్నవారిలో 14శాతం మంది టీనేజి అమ్మాయిలే ఉంటున్నారని […]
నగరాల్లో అబార్షన్లు చేయించుకుంటున్నటీనేజి అమ్మాయిల సంఖ్య రానురాను పెరుగుతున్నదని ఒక ప్రభుత్వ ఆరోగ్య సర్వే వెల్లడించింది. నగరాల్లో పెరుగుతున్న స్వేచ్ఛా వాతావరణం ఇందుకు ఒక ముఖ్యకారణమని ఎన్ఎస్ఎస్ఓ (నేషనల్ శాంపిల్ సర్వే ఆర్గనైజేషన్) సర్వే పేర్కొంది. నమోదు అవుతున్న మొత్తం గర్భధారణల్లో నగరాల్లో 74శాతం, గ్రామాల్లో 77శాతం వరకు బిడ్డలు సురక్షితంగా జన్మిస్తున్నారని, నగరాల్లో 3శాతం, గ్రామాల్లో 2శాతం అబార్షన్లు ఉంటున్నాయని సర్వే తెలిపింది. అయితే నగరాల్లో అబార్షన్లు చేయించుకుంటున్నవారిలో 14శాతం మంది టీనేజి అమ్మాయిలే ఉంటున్నారని సర్వే తేల్చింది. 20 సంవత్సరాలలోపు ఉన్న అమ్మాయిల ప్రెగ్నెన్సీల్లో ఇలా అనవసర గర్భాలుగా మిగులుతున్నవాటి సంఖ్య అత్యధికంగా 21శాతం వరకు ఉన్నదని కూడా ఈ సర్వేలో తేలింది. అయితే టీనేజర్లలో పెరుగుతున్న అబార్షన్లకు కారణాలను విశ్లేషించడానికి మరిన్ని అధ్యయనాలు నిర్వహించాల్సి ఉంటుందని సర్వే పేర్కొంది.