Telugu Global
Cinema & Entertainment

అర్జున్ రెడ్డి హీరోయిన్ మారిపోయింది

తెలుగులో కల్ట్ క్లాసిక్ గా నిలిచిన అర్జున్ రెడ్డి సినిమా ప్రస్తుతం ఒకేసారి తమిళ, హిందీ భాషల్లో రీమేక్ అవుతున్న విషయం తెలిసిందే. తమిళ రీమేక్ దాదాపు రెడీ అయిపోయింది. ఈరోజు టీజర్ కూడా విడుదలైంది. కానీ ఇప్పుడు మనం మాట్లాడుకోబోతోంది అది కాదు. ఇది హిందీ రీమేక్ సంగతి. అవును.. ఉన్నట్టుండి హిందీ అర్జున్ రెడ్డి ప్రాజెక్టులో హీరోయిన్ మారిపోయింది. షాహిద్ కపూర్ హీరోగా నటిస్తున్న ఈ రీమేక్ ప్రాజెక్టులో హీరోయిన్ కోసం మొన్నటివరకు చాలా […]

అర్జున్ రెడ్డి హీరోయిన్ మారిపోయింది
X

తెలుగులో కల్ట్ క్లాసిక్ గా నిలిచిన అర్జున్ రెడ్డి సినిమా ప్రస్తుతం ఒకేసారి తమిళ, హిందీ భాషల్లో రీమేక్ అవుతున్న విషయం తెలిసిందే. తమిళ రీమేక్ దాదాపు రెడీ అయిపోయింది. ఈరోజు టీజర్ కూడా విడుదలైంది. కానీ ఇప్పుడు మనం మాట్లాడుకోబోతోంది అది కాదు. ఇది హిందీ రీమేక్ సంగతి. అవును.. ఉన్నట్టుండి హిందీ అర్జున్ రెడ్డి ప్రాజెక్టులో హీరోయిన్ మారిపోయింది.

షాహిద్ కపూర్ హీరోగా నటిస్తున్న ఈ రీమేక్ ప్రాజెక్టులో హీరోయిన్ కోసం మొన్నటివరకు చాలా వెదికారు. పైనల్ గా తారా సుతారియా అనే అమ్మాయిని ఫైనల్ చేశారు. 5 రోజులు షూటింగ్ కూడా జరిగింది. ఇంతలోనే ఓ మంచి ఆఫర్ రావడంతో తారా సుతారియా జంప్ కొట్టింది. దీంతో హీరోయిన్ వేట మళ్లీ మొదటికొచ్చింది. అయితే ఈసారి కాస్త పేరున్న హీరోయిన్ నే వెదికి పట్టుకున్నారు యూనిట్ సభ్యులు.

అవును.. అర్జున్ రెడ్డి హిందీ రీమేక్ లో షాహిద్ సరసన కైరా అద్వానీ హీరోయిన్ గా నటించబోతోంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుంది. తెలుగులో మహేష్ బాబు సరసన భరత్ అనే నేను సినిమాలో నటించింది కైరా. తర్వాత నెట్ ఫ్లిక్స్ ప్రొడ్యూస్ చేసిన లస్ట్ స్టోరీస్ తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆమెకు అర్జున్ రెడ్డి హిందీ రీమేక్ ఆఫర్ రావడానికి ప్రధాన కారణం ఈ లస్ట్ స్టోరీసే అని తెలుస్తోంది.

First Published:  23 Sep 2018 12:32 PM GMT
Next Story