Telugu Global
NEWS

కాంగ్రెస్ మద్దతు కోరడమా!... సిగ్గుచేటు " కేవీపీ

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామచంద్రరావు మరోసారి ఫైర్ అయ్యారు. బహిరంగ లేఖ రాశారు. ప్రత్యేక హోదాకు తానే ప్రతినిధి అయినట్టు చంద్రబాబు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. హోదా వద్దు.. ప్యాకేజ్ కావాలని ఆనాడు అసెంబ్లీలో తీర్మానం చేసింది చంద్రబాబు కాదా అని ప్రశ్నించారు. ఇప్పుడు తిరిగి హోదా కావాలంటూ అసెంబ్లీలో తీర్మానంచేస్తారా? అని నిలదీశారు. ప్రజలను మభ్యపెట్టేందుకు చంద్రబాబు కొత్త డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. హోదా విషయంలో కాంగ్రెస్‌ మద్దతును చంద్రబాబు కోరడం సిగ్గుచేటన్నారు […]

కాంగ్రెస్ మద్దతు కోరడమా!... సిగ్గుచేటు  కేవీపీ
X

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామచంద్రరావు మరోసారి ఫైర్ అయ్యారు. బహిరంగ లేఖ రాశారు. ప్రత్యేక హోదాకు తానే ప్రతినిధి అయినట్టు చంద్రబాబు వ్యవహరిస్తున్నారని విమర్శించారు.

హోదా వద్దు.. ప్యాకేజ్ కావాలని ఆనాడు అసెంబ్లీలో తీర్మానం చేసింది చంద్రబాబు కాదా అని ప్రశ్నించారు. ఇప్పుడు తిరిగి హోదా కావాలంటూ అసెంబ్లీలో తీర్మానంచేస్తారా? అని నిలదీశారు. ప్రజలను మభ్యపెట్టేందుకు చంద్రబాబు కొత్త డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు.

హోదా విషయంలో కాంగ్రెస్‌ మద్దతును చంద్రబాబు కోరడం సిగ్గుచేటన్నారు కేవీపీ. ప్రత్యేక హోదాకు తాను ప్రైవేట్ బిల్లు ప్రవేశపెడితే నాడు టీడీపీ సహకరించలేదన్నారు. ఎన్నికలు వస్తుండడంతో చంద్రబాబుకు భయంపట్టుకుందన్నారు. చంద్రబాబుకు చిత్తశుద్ది ఉంటే హోదా ఉద్యమంలో పెట్టిన కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.

First Published:  23 Sep 2018 2:50 AM GMT
Next Story