Telugu Global
International

భారత ప్రధానిపై పాక్‌ ప్రధాని అనుచిత వ్యాఖ్యలు

పాకిస్తాన్‌తో చర్చలను భారత్ తిరస్కరించడంపై పాక్‌ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అసహనం వ్యక్తం చేశారు. పాక్‌తో భారత్‌ చర్చలు పునర్‌ ప్రారంభించాలని కొద్ది రోజుల క్రితం ఇమ్రాన్ ఖాన్ కోరడంతో న్యూయార్క్‌లో జరిగే ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం సందర్భంగా భారత్‌, పాక్‌ విదేశాంగ మంత్రుల సమావేశానికి భారత్ ఓకే చెప్పింది. కానీ అలా ఓకే చెప్పిన మరుసటి రోజే కశ్మీర్‌లో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు ముగ్గురు పోలీసులను కిడ్నాప్ చేసి హతమార్చారు. మరో ఘటనలో పాకిస్తాన్ సైనిక […]

భారత ప్రధానిపై పాక్‌ ప్రధాని అనుచిత వ్యాఖ్యలు
X

పాకిస్తాన్‌తో చర్చలను భారత్ తిరస్కరించడంపై పాక్‌ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అసహనం వ్యక్తం చేశారు. పాక్‌తో భారత్‌ చర్చలు పునర్‌ ప్రారంభించాలని కొద్ది రోజుల క్రితం ఇమ్రాన్ ఖాన్ కోరడంతో న్యూయార్క్‌లో జరిగే ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం సందర్భంగా భారత్‌, పాక్‌ విదేశాంగ మంత్రుల సమావేశానికి భారత్ ఓకే చెప్పింది.

కానీ అలా ఓకే చెప్పిన మరుసటి రోజే కశ్మీర్‌లో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు ముగ్గురు పోలీసులను కిడ్నాప్ చేసి హతమార్చారు. మరో ఘటనలో పాకిస్తాన్ సైనిక మూకలు భారత జవాను నరేంద్ర సింగ్‌ను అత్యంత కిరాతకంగా గొంతుకోసి చంపాయి. దీంతో పాక్‌తో చర్చలను భారత్ తిరస్కరించింది. ఈనేపథ్యంలో ట్విట్టర్లో స్పందించిన ఇమ్రాన్‌ ఖాన్…. భారతప్రధాని మోడీపై అనుచిత వ్యాఖ్యలు చేశారు.

తక్కువ స్థాయి వ్యక్తి ఉన్నతమైన పదవిలో ఉన్నారంటూ వ్యాఖ్యానించారు. శాంతి చర్చలను ఏకపక్షంగా రద్దు చేయడం భారత్ దురహంకారానికి నిదర్శనమని మండిపడ్డారు. ”భారత్ దురహంకారపూరిత, ప్రతికూల స్పందనపై తీవ్ర నిరాశకు గురయ్యాను. ఉన్నత పదవులు చేపట్టిన తక్కువ స్థాయి వ్యక్తులను నేను చాలామందిని చూశాను. విశాల ప్రపంచాన్ని చూడగల దార్శనికత వారికి ఉండదు..’’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు ఇమ్రాన్ ఖాన్‌.

First Published:  22 Sep 2018 9:00 AM GMT
Next Story