Telugu Global
NEWS

కేసీఆర్‌పై బాబు వ్యాఖ్యలు.... రీజన్ అదేనా!

ఈ మధ్య తెలంగాణ సీఎం, తెరాస అధినేత కేసీఆర్ పై చంద్రబాబు నాయుడు తరచూ ప్రేమను వ్యక్తీకరిస్తున్నాడు. కేసీఆర్‌తో తను సన్నిహితంగా ఉండాలని అనుకున్నాను అని…. అయితే భారతీయ జనతా పార్టీ తమ మధ్యన బంధాన్ని చెడబెట్టిందని చంద్రబాబునాయుడు వాపోతూ ఉన్నాడు. ఏపీ అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు ఇదే విషయాన్ని చెప్పాడు. తాజాగా మరోసారి ఇదే విషయాన్ని ప్రస్తావించాడు. తను కేసీఆర్‌తో సాన్నిహిత్యాన్ని కోరుకుంటున్నాను అని చంద్రబాబు నాయుడు పదే పదే చెబుతున్నాడు. ఈ విధంగా తెరాస […]

కేసీఆర్‌పై బాబు వ్యాఖ్యలు.... రీజన్ అదేనా!
X

ఈ మధ్య తెలంగాణ సీఎం, తెరాస అధినేత కేసీఆర్ పై చంద్రబాబు నాయుడు తరచూ ప్రేమను వ్యక్తీకరిస్తున్నాడు. కేసీఆర్‌తో తను సన్నిహితంగా ఉండాలని అనుకున్నాను అని…. అయితే భారతీయ జనతా పార్టీ తమ మధ్యన బంధాన్ని చెడబెట్టిందని చంద్రబాబునాయుడు వాపోతూ ఉన్నాడు.

ఏపీ అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు ఇదే విషయాన్ని చెప్పాడు. తాజాగా మరోసారి ఇదే విషయాన్ని ప్రస్తావించాడు. తను కేసీఆర్‌తో సాన్నిహిత్యాన్ని కోరుకుంటున్నాను అని చంద్రబాబు నాయుడు పదే పదే చెబుతున్నాడు.

ఈ విధంగా తెరాస అధినేతపై చంద్రబాబు నాయుడు పదే పదే ప్రేమను వ్యక్తీకరిస్తున్నాడు. ఈ వ్యక్తీకరణకు రీజన్ ఏమిటో స్పష్టంగానే అర్థం అవుతోంది. ఎన్నికలు సమీపించిన నేపథ్యంలో తెలంగాణ లో నేతలపై వరసగా పాత కేసులు బయటకు వస్తున్నాయి. కొందరు అరెస్టు కూడా అయ్యారు. ఈ నేపథ్యంలో ఓటుకు నోటు కేసులో కూడా కదలిక ఖాయమని స్పష్టం అవుతోంది. అందుకే చంద్రబాబు నాయుడు కేసీఆర్ పై ఇలా ప్రేమను వ్యక్తీకరిస్తున్నాడని స్పష్టం అవుతోంది.

ఈ పరిణామాల నేపథ్యంలో తాజా అప్ డేట్ ఏమిటంటే.. ఓటుకు నోటు కేసు కదలడం ఖాయమైంది అనేది. ఇందుకు సంబంధించి అప్ డేట్స్ ఢిల్లీ నుంచి అందుతున్నాయి. వాటి ప్రకారం.. ఓటుకు నోటు కేసులో ఈడీ విచారణ మొదలు కానున్నదని తెలుస్తోంది. మొత్తం ఐదు కోట్ల రూపాయలు చెల్లించి తెలంగాణలో ఎమ్మెల్యేలను కొనడానికి ప్రయత్నించారనే ఓటుకు నోటు కేసులో అభియోగాలు నమోదయ్యాయి.

ఇన్ని రోజులూ ఈ కేసులో చంద్రబాబు నాయుడు తప్పించుకోవడానికి హైదరాబాద్‌ను ఖాళీ చేసి వచ్చాడు. ఇప్పుడు ఎన్నికలు వచ్చిన నేపథ్యంలో చంద్రబాబు నాయుడు మళ్లీ కాంగ్రెస్ తో జట్టు కడుతున్నాడు. తెలంగాణలో ఉనికిని నిలబెట్టుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. అయితే కేసీఆర్ ఎక్కడ ఓటుకు నోటు కేసును తీస్తాడో…. అని ఆయనపై ప్రేమను వ్యక్తీకరిస్తున్నాడు. దటీజ్ చంద్రబాబు!

First Published:  22 Sep 2018 1:19 AM GMT
Next Story