Telugu Global
Cinema & Entertainment

ఎట్టకేలకు షూటింగ్ పూర్తీ చేసుకోనున్న "సవ్యసాచి"

“ప్రేమం” తో తెలుగు ప్రేక్షకులని ఆకట్టుకున్నారు చందు మొండేటి, నాగ చైతన్య. మళ్ళి చందు మొండేటి దర్శకత్వంలో నాగచైతన్య రెండో సారి నటిస్తున్న చిత్రం “సవ్యసాచి”. చాలా కాలంగా షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ చిత్రానికి ఈరోజు గుమ్మడికాయ కొట్టనున్నారు. విభిన్న కథాంశంగా తెరకెక్కుతోన్న ఈ చిత్రం షూటింగ్‌ పూర్తి చేసుకుని విడుదలకు ముస్తాబవుతోంది. వచ్చే నెల్లో ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. మైత్రి మూవీ మేకర్స్ వారు ప్రొడ్యూస్ చేసిన ఈ […]

ఎట్టకేలకు షూటింగ్ పూర్తీ చేసుకోనున్న సవ్యసాచి
X

“ప్రేమం” తో తెలుగు ప్రేక్షకులని ఆకట్టుకున్నారు చందు మొండేటి, నాగ చైతన్య. మళ్ళి చందు మొండేటి దర్శకత్వంలో నాగచైతన్య రెండో సారి నటిస్తున్న చిత్రం “సవ్యసాచి”. చాలా కాలంగా షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ చిత్రానికి ఈరోజు గుమ్మడికాయ కొట్టనున్నారు.

విభిన్న కథాంశంగా తెరకెక్కుతోన్న ఈ చిత్రం షూటింగ్‌ పూర్తి చేసుకుని విడుదలకు ముస్తాబవుతోంది. వచ్చే నెల్లో ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. మైత్రి మూవీ మేకర్స్ వారు ప్రొడ్యూస్ చేసిన ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది.

ఎలియాన్ హ్యాండ్ సిండ్రోమ్ ఉన్న వ్యక్తిగా నాగ చైతన్య ఈ సినిమా లో నటిస్తున్నాడు. అంటే సినిమాలో నాగ చైతన్య తన చేతిని అదుపులో ఉంచుకోలేడు అనమాట. మరి చందు మొండేటి తన కథనంతో ఈ సినిమాని ఏ రేంజ్ లో తెరకెక్కించాడు అనేది తెలియాలి అంటే మరి కొన్ని రోజులు ఆగాల్సిందే. ఎం.ఎం కీరవాణి ఈ సినిమాకి సంగీతాన్ని అందించాడు.

ఇటివలే “శైలజా రెడ్డి అల్లుడు” సినిమాతో జస్ట్ యావరేజ్ హిట్ ని అందుకున్న చైతు ఆశలు అన్ని ఇప్పుడు ఈ సినిమా మీదే ఉన్నాయి.

First Published:  20 Sep 2018 12:04 AM GMT
Next Story