Telugu Global
National

ఉత్తరాఖండ్‌ రాష్ట్ర మాతగా ‘గోవు’

గోవును రాష్ట్రమాత గా గుర్తిస్తూ ఉత్తరాఖండ్‌ అసెంబ్లీ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. రాష్ట్ర పశు సంవర్థక శాఖ మంత్రి రేఖా ఆర్య ప్రవేశపెట్టిన ఈ తీర్మానాన్ని అసెంబ్లీ ఆమోదించింది. ఈ తీర్మానాన్ని ప్రతిపక్షం వ్యతిరేకించినా ఉపయోగం లేకుండా పోయింది. వాస్తవానికి ఈనెల 18నే ఈ తీర్మానం ఆమోదించాల్సి ఉంది. సీనియర్‌ బీజేపీ నాయకుడు, ఎమ్మెల్యే హర్భన్స్‌ కపూర్‌ ఈ తీర్మానాన్ని ప్రతిపాదించాల్సి ఉంది. కానీ ద్రవ్యోల్బణంపై ప్రతిపక్షం చర్చ కొనసాగించడంతో ప్రశ్నోత్తరాలు సుదీర్భంగా సాగి సమయం వృధా […]

ఉత్తరాఖండ్‌ రాష్ట్ర మాతగా ‘గోవు’
X

గోవును రాష్ట్రమాత గా గుర్తిస్తూ ఉత్తరాఖండ్‌ అసెంబ్లీ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. రాష్ట్ర పశు సంవర్థక శాఖ మంత్రి రేఖా ఆర్య ప్రవేశపెట్టిన ఈ తీర్మానాన్ని అసెంబ్లీ ఆమోదించింది. ఈ తీర్మానాన్ని ప్రతిపక్షం వ్యతిరేకించినా ఉపయోగం లేకుండా పోయింది. వాస్తవానికి ఈనెల 18నే ఈ తీర్మానం ఆమోదించాల్సి ఉంది. సీనియర్‌ బీజేపీ నాయకుడు, ఎమ్మెల్యే హర్భన్స్‌ కపూర్‌ ఈ తీర్మానాన్ని ప్రతిపాదించాల్సి ఉంది. కానీ ద్రవ్యోల్బణంపై ప్రతిపక్షం చర్చ కొనసాగించడంతో ప్రశ్నోత్తరాలు సుదీర్భంగా సాగి సమయం వృధా అయ్యింది. దాంతో 19వ తేదీకి ఈ తీర్మానాన్ని వాయిదా వేశారు.

‘గోవు ఒక్కటే ఈ భూమి మీద ఆక్సిజన్‌ను తీసుకుని ఆక్సిజన్‌ను విడుదల చేసే జంతువు’ అని రేఖా ఆర్య పేర్కొన్నారు. గో మూత్రంలో ఔషధ గుణాలున్నాయని గుర్తించారని, మాతృత్వానికి ప్రతిరూపంగా గోవును కొలుస్తారని రేఖా ఆర్య తీర్మానంపై చర్చ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఉత్తరాఖండ్‌లోని జాతీయ రహదారులలో ఎక్కడ చూసినా ఆవుల మందలు కనిపిస్తుంటాయి. వాటి రక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి రక్షణ చర్యలూ తీసుకోవడం లేదు. పాడి రైతులకు ప్రత్యేకంగా సంక్షేమ పథకాలూ అమలు కావడం లేదు. ఆవుల కోసం షెడ్లను నిర్మించాలని, గోరక్షణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని నైనిటాల్‌ హైకోర్టు పలుమార్లు తీర్పులిచ్చినా రాష్ట్ర ప్రభుత్వంలో చలనం లేదు.

ఆవును రాష్ట్రమాతగా గుర్తించి తీర్మానం చేయడం, ఆమోదం కోసం కేంద్రానికి పంపడం హాస్యాస్పదంగా ఉందని విమర్శకులంటున్నారు.

First Published:  20 Sep 2018 2:00 AM GMT
Next Story