Telugu Global
Cinema & Entertainment

ఎన్టీఆర్ సినిమాలో ఏఎన్నార్.. అదరగొట్టాడు

సినిమా షూటింగ్, కంటెంట్ సంగతి పక్కనపెడితే పబ్లిసిటీలో మాత్రం ఎన్టీఆర్ బయోపిక్ అదరగొడుతోంది. ఇప్పటికే ఎన్టీఆర్ లుక్ లో ఉండే బాలయ్య స్టిల్స్ ను విడుదల చేసి సెన్సేషన్ క్రియేట్ చేసిన దర్శకుడు క్రిష్.. ఆమధ్య చంద్రబాబు లుక్ లో ఉన్న రానా స్టిల్స్ కూడా విడుదల చేశారు. ఇప్పుడు వీటికి కొనసాగింపుగా ఈరోజు ఏఎన్నార్ గెటప్ లో ఉన్న సుమంత్ స్టిల్స్ విడుదల చేశాడు. సుమంత్ లో ఏఎన్నార్ ఛాయలు కాస్త ఎక్కువే. ఆ పోలికలు […]

ఎన్టీఆర్ సినిమాలో ఏఎన్నార్.. అదరగొట్టాడు
X

సినిమా షూటింగ్, కంటెంట్ సంగతి పక్కనపెడితే పబ్లిసిటీలో మాత్రం ఎన్టీఆర్ బయోపిక్ అదరగొడుతోంది. ఇప్పటికే ఎన్టీఆర్ లుక్ లో ఉండే బాలయ్య స్టిల్స్ ను విడుదల చేసి సెన్సేషన్ క్రియేట్ చేసిన దర్శకుడు క్రిష్.. ఆమధ్య చంద్రబాబు లుక్ లో ఉన్న రానా స్టిల్స్ కూడా విడుదల చేశారు. ఇప్పుడు వీటికి కొనసాగింపుగా ఈరోజు ఏఎన్నార్ గెటప్ లో ఉన్న సుమంత్ స్టిల్స్ విడుదల చేశాడు.

సుమంత్ లో ఏఎన్నార్ ఛాయలు కాస్త ఎక్కువే. ఆ పోలికలు ఏంటనేది ఈ లుక్ చేస్తే ఈజీగా అర్థమైపోతుంది. దీనికి తోడు ఎన్టీఆర్, ఏఎన్నార్ కలిసి సిగరెట్ తాగే సన్నివేశానికి సంబంధించిన స్టిల్ విడుదల చేసి సినిమాను మరింత క్రేజీగా మార్చేశాడు క్రిష్.

ఈరోజు ఉదయం ఏఎన్నార్ గెటప్ లో ఉన్న స్టిల్ మాత్రమే విడుదలైంది. కానీ కొద్దిసేపటి కిందట ఎన్టీఆర్, ఏఎన్నార్ కలిసి సిగరెట్ తాగుతున్న స్టిల్ విడుదలైంది. ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఒక్క ఫొటోతో సినిమాపై అంచనాలు అమాంతం పెరిగాయి. అంతేకాకుండా.. ఎన్టీఆర్, ఏఎన్నార్ చాలా సన్నిహితంగా ఉండేవారని, వాళ్లమధ్య ఉన్న సినిమా పోటీని బయోపిక్ లో చూపించడం లేదనే విషయాన్ని కూడా ఈ స్టిల్ ద్వారా పరోక్షంగా బయటపెట్టినట్టయింది.

First Published:  20 Sep 2018 5:34 AM GMT
Next Story