Telugu Global
NEWS

పుష్కర దారుణం... దిగ్బ్రాంతికరంగా సోమయాజుల నివేదిక

గోదావరి పుష్కరాల్లో జరిగిన తొక్కిసలాటలో 31 మంది చనిపోయిన ఘటనపై జస్టిస్ సోమయాజుల కమిషన్ తన నివేదికను సమర్పించింది. కమిషన్ రిపోర్టు అసెంబ్లీ ముందుకు వచ్చింది. చంద్రబాబు స్నానం చేస్తున్న సమయంలో దర్శకుడు బోయపాటి శీనుతో లఘుచిత్రం చిత్రీకరించేందుకు ప్రయత్నించడం వల్లే తొక్కిసలాట జరిగిందని తీవ్రస్థాయిలో ఆరోపణలు వచ్చాయి. అప్పట్లో కలెక్టర్‌ కూడా అందుకు బలాన్ని ఇస్తూ నివేదిక ఇచ్చారు. దాంతో ఘటనపై విచారణకు అంటూ సోమయాజుల కమిషన్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఏళ్లు గడిచిన తర్వాత […]

పుష్కర దారుణం... దిగ్బ్రాంతికరంగా సోమయాజుల నివేదిక
X

గోదావరి పుష్కరాల్లో జరిగిన తొక్కిసలాటలో 31 మంది చనిపోయిన ఘటనపై జస్టిస్ సోమయాజుల కమిషన్ తన నివేదికను సమర్పించింది. కమిషన్ రిపోర్టు అసెంబ్లీ ముందుకు వచ్చింది. చంద్రబాబు స్నానం చేస్తున్న సమయంలో దర్శకుడు బోయపాటి శీనుతో లఘుచిత్రం చిత్రీకరించేందుకు ప్రయత్నించడం వల్లే తొక్కిసలాట జరిగిందని తీవ్రస్థాయిలో ఆరోపణలు వచ్చాయి.

అప్పట్లో కలెక్టర్‌ కూడా అందుకు బలాన్ని ఇస్తూ నివేదిక ఇచ్చారు. దాంతో ఘటనపై విచారణకు అంటూ సోమయాజుల కమిషన్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఏళ్లు గడిచిన తర్వాత కమిషన్ నివేదిక ఇచ్చింది. ఊహించినట్టే చంద్రబాబుకు క్లీన్ చిట్ ఇచ్చింది. తొక్కిసలాటకు చంద్రబాబు కారణం కాదని కమిషన్ వెల్లడించింది.

ప్రచారం, రాజకీయ లబ్ది కోసమే చంద్రబాబుపై కొందరు తప్పుడు ఆరోపణలు చేశారని కమిషన్ వెల్లడించింది. ప్రమాదం జరిగిన సమయంలో చంద్రబాబు అక్కడ లేరని.. ఆయన వెళ్లిపోయిన తర్వాతే తొక్కిసలాట జరిగిందని రిపోర్టు ఇచ్చింది. ఘాట్‌ వెడల్పు కేవలం 300 మీటర్లు మాత్రమే ఉండడం వల్ల, ముహూర్తంపై అతిగా ప్రచారం చేయడం వల్ల భక్తులు ఒకేసారి రావడంతో తొక్కిసలాట జరిగిందని వెల్లడించింది. ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలను, గాయపడిన వారిని ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఆదుకున్నట్టు నివేదికలో జస్టిస్ సోమయాజులు వెల్లడించారు.

గతంలోనే సీసీ ఫుటేజ్ మాయం చేయగా… జస్టిస్ సోమయాజుల కమిషన్ మాత్రం అన్ని వీడియోలను పరిశీలించి నివేదిక ఇచ్చినట్టు చెబుతోంది. 31 మంది చనిపోయిన ప్రమాదంలో అసలు చంద్రబాబు తప్పేలేదని కమిషన్ ఇచ్చిన ఈ రిపోర్టుపై విమర్శలు వచ్చే అవకాశం ఉంది.

First Published:  19 Sep 2018 12:26 AM GMT
Next Story