Telugu Global
Cinema & Entertainment

డ్యూయల్ రోల్ లో రవితేజ కొత్త సినిమా ?

మాస్ మహారాజ్ రవితేజ ఈ ఏడాది “టచ్ చేసి చూడు” “నేల టిక్కెట్” సినిమాలతో ఫ్లాప్స్ ని అందుకొని డీలా పడిపోయాడు. ఎలాగైనా హిట్ కొట్టాలి అనే కసితో ఉన్న‌ రవితేజ తన మిత్రుడు శ్రీను వైట్లతో దర్శకత్వంలో “అమర్ అక్బర్ అంటోనీ” సినిమాలో నటిస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ వారు ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమాలో ఇలియానా హీరోయిన్ గా నటిస్తుండగా తమన్ సంగీతం అందిస్తున్నాడు. అయితే ఈ సినిమా తరువాత రవితేజ “టైగర్” “ఎక్కడికి […]

డ్యూయల్ రోల్ లో రవితేజ కొత్త సినిమా ?
X

మాస్ మహారాజ్ రవితేజ ఈ ఏడాది “టచ్ చేసి చూడు” “నేల టిక్కెట్” సినిమాలతో ఫ్లాప్స్ ని అందుకొని డీలా పడిపోయాడు. ఎలాగైనా హిట్ కొట్టాలి అనే కసితో ఉన్న‌ రవితేజ తన మిత్రుడు శ్రీను వైట్లతో దర్శకత్వంలో “అమర్ అక్బర్ అంటోనీ” సినిమాలో నటిస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ వారు ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమాలో ఇలియానా హీరోయిన్ గా నటిస్తుండగా తమన్ సంగీతం అందిస్తున్నాడు.

అయితే ఈ సినిమా తరువాత రవితేజ “టైగర్” “ఎక్కడికి పోతావు చిన్నవాడ” ఫేం వి.ఐ. ఆనంద్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమా డిసెంబర్ నుంచి సెట్స్ పైకి వెళ్లనుందట. ఈ విషయాన్నీ స్వయానా దర్శకుడు తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా తెలిపాడు. అలాగే ఈ సినిమాకి ఎస్.ఎస్.తమన్ సంగీతం అందించాబోతున్నాడు అనే విషయాన్ని కూడా ప్రకటించాడు. ఇప్పటికే తమన్ ఈ సినిమా కోసం కొన్ని ట్యూన్స్ ని రెడీ చేసాడు అని తెలుస్తుంది. ఈ సినిమాలో రవితేజ తండ్రి, కొడుకులుగా డ్యూయల్ రోల్ లో నటిస్తున్నాడు.

First Published:  18 Sep 2018 10:38 PM GMT
Next Story