Telugu Global
Cinema & Entertainment

మరో సారి నాగ్ అశ్విన్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ

“ఎవడే సుబ్రహ్మణ్యం” సినిమాతో విజయ్ దేవరకొండ లోని నటున్ని బయటకి తీసుకొని వచ్చాడు డైరెక్టర్ నాగ్ అశ్విన్. ఆ సినిమా తరువాత విజయ్ దేవరకొండ “పెళ్లి చూపులు” “అర్జున్ రెడ్డి” వంటి మూవీస్ లో నటించి స్టార్ గా ఎదిగాడు. మధ్యలో నాగ్ అశ్విన్ తో ఉన్న అనుబంధం తో “మహానటి” అనే సినిమాలో కూడా నటించాడు విజయ్ దేవరకొండ. అయితే ఇప్పుడు వీళ్ళిద్దరి కాంబినేషన్ లో మూడో సినిమా రాబోతుందట. ఈమధ్యనే “దేవదాస్” సినిమా ప్రమోషన్స్ […]

మరో సారి నాగ్ అశ్విన్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ
X

“ఎవడే సుబ్రహ్మణ్యం” సినిమాతో విజయ్ దేవరకొండ లోని నటున్ని బయటకి తీసుకొని వచ్చాడు డైరెక్టర్ నాగ్ అశ్విన్. ఆ సినిమా తరువాత విజయ్ దేవరకొండ “పెళ్లి చూపులు” “అర్జున్ రెడ్డి” వంటి మూవీస్ లో నటించి స్టార్ గా ఎదిగాడు. మధ్యలో నాగ్ అశ్విన్ తో ఉన్న అనుబంధం తో “మహానటి” అనే సినిమాలో కూడా నటించాడు విజయ్ దేవరకొండ. అయితే ఇప్పుడు వీళ్ళిద్దరి కాంబినేషన్ లో మూడో సినిమా రాబోతుందట.

ఈమధ్యనే “దేవదాస్” సినిమా ప్రమోషన్స్ లో భాగంగా అశ్విని దత్ తన తరువాతి ప్రాజెక్ట్స్ గురించి చెబుతూ విజయ్ దేవరకొండ తో ఒక సినిమా చేస్తున్నాం అని చెప్పారు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ వేరే ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నాడు అని ఆ ప్రాజెక్ట్స్ నుంచి విజయ్ ఫ్రీ అవ్వగానే ఈ సినిమా స్టార్ట్ అవ్వబోతుంది అని కూడా చెప్పుకొచ్చాడు అశ్విని దత్. “మహానటి” లాంటి సినిమా తరువాత నాగ్ అశ్విన్ ఏ సినిమా డైరెక్ట్ చేయబోతున్నాడు అనే ఆసక్తి అందరిలో నెలకొంది. ఇప్పుడు వారందరూ అనౌన్స్ అయిన ఈ సినిమా పై అంచనాలు పెట్టుకున్నారు.

First Published:  19 Sep 2018 2:55 AM GMT
Next Story