Telugu Global
NEWS

స్టేషన్‌పై స్పీకర్ కుమారుడి దాడి

ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు తనయుడు కోడెల శివరామకృష్ణ పోలీస్‌ స్టేషన్‌పై దాడి చేశారు. అనుచరులతో కలిసి వెళ్లి గుంటూరు జిల్లా రొంపిచర్ల స్టేషన్‌ వద్దకు చేరుకుని రచ్చ చేశారు. ఈ దౌర్జన్యాన్ని చిత్రీకరిస్తున్న కానిస్టేబుల్‌పై బూతులు అందుకున్నారు శివరామకృష్ణ. వినాయక నిమజ్జనం సందర్భంగా రొంపిచర్ల మండలం ఎడ్వర్టుపేటలో చిన్న పాటి వివాదం తలెత్తగా టీడీపీ వర్గీయులు… వైసీపీ వారిపై దాడి చేశారు. ఈ దాడికి కారణమైన టీడీపీ నాయకుడు కొలికొండ కొండలును పోలీసులు స్టేషన్‌కు తీసుకొచ్చారు. […]

స్టేషన్‌పై స్పీకర్ కుమారుడి దాడి
X

ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు తనయుడు కోడెల శివరామకృష్ణ పోలీస్‌ స్టేషన్‌పై దాడి చేశారు. అనుచరులతో కలిసి వెళ్లి గుంటూరు జిల్లా రొంపిచర్ల స్టేషన్‌ వద్దకు చేరుకుని రచ్చ చేశారు. ఈ దౌర్జన్యాన్ని చిత్రీకరిస్తున్న కానిస్టేబుల్‌పై బూతులు అందుకున్నారు శివరామకృష్ణ.

వినాయక నిమజ్జనం సందర్భంగా రొంపిచర్ల మండలం ఎడ్వర్టుపేటలో చిన్న పాటి వివాదం తలెత్తగా టీడీపీ వర్గీయులు… వైసీపీ వారిపై దాడి చేశారు. ఈ దాడికి కారణమైన టీడీపీ నాయకుడు కొలికొండ కొండలును పోలీసులు స్టేషన్‌కు తీసుకొచ్చారు. ఈ విషయం తెలుసుకున్న కోడెల కుమారుడు స్టేషన్ వద్దకు చేరుకుని పోలీసులపై విరుచుకుపడ్డారు. డీఎస్పీ నాగేశ్వరరావుతో వాగ్వాదానికి దిగారు. ఇక ఆయన అనుచరులు స్టేషన్‌లోనే పోలీసులపై తిట్లదండకం అందుకున్నారు. ఈ దృశ్యాలను చిత్రీకరిస్తున్న కానిస్టేబుల్‌ దగ్గర నుంచి కెమెరా లాక్కునే ప్రయత్నం చేశారు.

అరెస్ట్ అయిన వ్యక్తిని వెంటనే ఎలాంటి షరతులు లేకుండా వదిలేయాలని కోడెల శివరామకృష్ణ డిమాండ్ చేశారు. అయితే ఇప్పటికిప్పుడు వదిలేస్తే లేనిపోని విమర్శలు వస్తాయని.. కాబట్టి కొంచెం సమయం కావాలని పోలీసులు కోరడంతో కోడెల శివరాం అక్కడి నుంచి వెళ్లిపోయారు.

First Published:  18 Sep 2018 9:28 PM GMT
Next Story