Telugu Global
Cinema & Entertainment

ఎన్టీఆర్ తో భారీ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసిన అశ్విని దత్

స్టార్ ప్రొడ్యూసర్ అశ్విని దత్ ప్రస్తుతం వరుస సినిమాలు ప్రొడ్యూస్ చేస్తూ బిజీగా ఉన్నాడు. ఇప్పటికే నాగార్జున, నానితో “దేవదాస్” సినిమాని తీసి రిలీజ్ కి రెడీ చేసిన అశ్విని దత్ సూపర్ స్టార్ మహేష్ బాబు తో “మహర్షి” సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నాడు. అయితే “దేవదాస్” ప్రమోషన్స్ లో భాగంగా మీడియా తో మాట్లాడిన అశ్విని దత్ ఎన్టీఆర్ తో ఒక క్రేజీ ప్రాజెక్ట్ ఉంటుంది అని చెప్పాడు. త్వరలో వైజయంతి మూవీస్ బ్యానర్ లో […]

ఎన్టీఆర్ తో భారీ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసిన అశ్విని దత్
X

స్టార్ ప్రొడ్యూసర్ అశ్విని దత్ ప్రస్తుతం వరుస సినిమాలు ప్రొడ్యూస్ చేస్తూ బిజీగా ఉన్నాడు. ఇప్పటికే నాగార్జున, నానితో “దేవదాస్” సినిమాని తీసి రిలీజ్ కి రెడీ చేసిన అశ్విని దత్ సూపర్ స్టార్ మహేష్ బాబు తో “మహర్షి” సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నాడు. అయితే “దేవదాస్” ప్రమోషన్స్ లో భాగంగా మీడియా తో మాట్లాడిన అశ్విని దత్ ఎన్టీఆర్ తో ఒక క్రేజీ ప్రాజెక్ట్ ఉంటుంది అని చెప్పాడు. త్వరలో వైజయంతి మూవీస్ బ్యానర్ లో ఈ ప్రోజేచి ఉంటుందట.

భారీ బడ్జెట్ తో తెరకెక్కునున్న ఈ ప్రాజెక్ట్ తమిళ్ డైరెక్టర్ అట్లీ డైరెక్ట్ చేయబోతున్నాడట. అట్లీ ఇప్పటికే తెలుగులో “రాజా రాణి” “అదిరింది” సినిమాలతో మంచి హిట్స్ ని అందుకున్నాడు. ఇకపోతే ఎన్టీఆర్ ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో “అరవింద సమేత” లో నటిస్తున్నాడు. ఈ సినిమా తరువాత రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ తో కలిసి ఒక సినిమా చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలు పూర్తైన తరువాత అశ్విని దత్ ప్రొడక్షన్ లో సినిమా చెయ్యబోతున్నాడు ఎన్టీఆర్.

First Published:  18 Sep 2018 10:16 PM GMT
Next Story