Telugu Global
NEWS

పెద్దిరెడ్డిపై మహిళా అభ్యర్థి పోటీ

వైసీపీ సీనియర్‌ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పుంగనూరులో టీడీపీకి సరైన అభ్యర్థులు దొరకడం కష్టంగా ఉంది.. గెలుపు సంగతి ఎలా ఉన్నా పెద్దిరెడ్డికి గట్టి పోటీ ఇవ్వడం ద్వారా సత్తా చాటాలనుకుంటోంది టీడీపీ. 2019 ఎన్నికల్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై కొత్త అభ్యర్థిని నిలబెట్టబోతోంది ఆ పార్టీ. ఫిరాయింపు మంత్రి అమర్‌నాథ్‌ రెడ్డి కుటుంబానికి చెందిన అనుషారెడ్డిని తెరపైకి తెచ్చారు. ఈమె మంత్రి అమర్‌నాథ్‌ రెడ్డికి స్వయాన మరదలు. పుంగనూరులో సరైన అభ్యర్థి కోసం అన్వేషిస్తున్న […]

పెద్దిరెడ్డిపై మహిళా అభ్యర్థి పోటీ
X

వైసీపీ సీనియర్‌ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పుంగనూరులో టీడీపీకి సరైన అభ్యర్థులు దొరకడం కష్టంగా ఉంది.. గెలుపు సంగతి ఎలా ఉన్నా పెద్దిరెడ్డికి గట్టి పోటీ ఇవ్వడం ద్వారా సత్తా చాటాలనుకుంటోంది టీడీపీ. 2019 ఎన్నికల్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై కొత్త అభ్యర్థిని నిలబెట్టబోతోంది ఆ పార్టీ.

ఫిరాయింపు మంత్రి అమర్‌నాథ్‌ రెడ్డి కుటుంబానికి చెందిన అనుషారెడ్డిని తెరపైకి తెచ్చారు. ఈమె మంత్రి అమర్‌నాథ్‌ రెడ్డికి స్వయాన మరదలు. పుంగనూరులో సరైన అభ్యర్థి కోసం అన్వేషిస్తున్న చంద్రబాబు… అనుషారెడ్డి అయితే కొంచెం బెటర్‌గా ఉంటుందని భావించారు.

ఇటీవల ఆమెను, ఆమె భర్తను పిలిపించుకుని మాట్లాడారు. పుంగనూరు నుంచి పోటీ చేయాల్సిందిగా విజ్జప్తి చేశారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై పోటీ అనగానే వారు కాస్త ఆలోచించినట్టు చెబుతున్నారు.. అయితే చంద్రబాబు మాత్రం పార్టీ కోసం బరిలోకి దిగాల్సిందిగా విజ్జప్తి చేశారు. మంత్రి అమర్‌నాథ్‌ రెడ్డి కూడా ఒత్తిడి తేవడంతో పోటీకి అనుషారెడ్డి అంగీకరించారు.

ఇప్పటి వరకు నియోజవకర్గ బాధ్యతలు చూస్తూ వచ్చిన బాబురెడ్డి కూడా పోటీ నుంచి తప్పుకునేందుకు ఏమాత్రం అభ్యంతరం తెలపలేదు. అయితే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అనుషా రెడ్డి పోటీ ఇవ్వగలరా అన్న దానిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

First Published:  18 Sep 2018 9:51 PM GMT
Next Story