Telugu Global
Cinema & Entertainment

ఫస్ట్ లుక్ పోస్టర్ అనుకుంటే టీజర్ వచ్చింది

అఖిల్ మూడో సినిమా మిస్టర్ మజ్ను. ఈ మేరకు టైటిల్ రిజిస్టర్ చేయించారు. అదే టైటిల్ ను ఈరోజు అఫీషియల్ గా ఎనౌన్స్ చేశారు. ఇందులో జనాలకు ఎలాంటి షాక్ లేదు. తెలిసిన మేటరే. కాకపోతే అన్నింటికంటే పెద్ద షాక్ ఏంటంటే.. ఈరోజు టీజర్ విడుదల చేయడం. అవును.. మిస్టర్ మజ్ను సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ విడుదల చేయబోతున్నామంటూ దాదాపు 4 రోజులుగా హంగామా చేసింది యూనిట్. ఫస్ట్ లుక్ అంటే టైటిల్ తో పాటు […]

ఫస్ట్ లుక్ పోస్టర్ అనుకుంటే టీజర్ వచ్చింది
X

అఖిల్ మూడో సినిమా మిస్టర్ మజ్ను. ఈ మేరకు టైటిల్ రిజిస్టర్ చేయించారు. అదే టైటిల్ ను ఈరోజు అఫీషియల్ గా ఎనౌన్స్ చేశారు. ఇందులో జనాలకు ఎలాంటి షాక్ లేదు. తెలిసిన మేటరే. కాకపోతే అన్నింటికంటే పెద్ద షాక్ ఏంటంటే.. ఈరోజు టీజర్ విడుదల చేయడం.

అవును.. మిస్టర్ మజ్ను సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ విడుదల చేయబోతున్నామంటూ దాదాపు 4 రోజులుగా హంగామా చేసింది యూనిట్. ఫస్ట్ లుక్ అంటే టైటిల్ తో పాటు అఖిల్ లుక్ తో ఓ పోస్టర్ వస్తుందని అంతా భావించారు. ఇంకాస్త ముందుకెళ్తే, ఫస్ట్ లుక్ పోస్టర్ తో పాటు మోషన్ పోస్టర్ వచ్చే ఛాన్స్ ఉందని భావించారు. కానీ అందర్నీ ఆశ్చర్యపరుస్తూ, మిస్టర్ మజ్ను నుంచి ఏకంగా టీజర్ లాంటిది విడుదల చేశారు. కాకపోతే దీనికి టీజర్ అని పేరుపెట్టలేదు. ఫస్ట్ లుక్ అనే చెబుతున్నారు. అంటే టీజర్ పేరిట మిస్టర్ మజ్ను నుంచి మరో వీడియో వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. నిజంగా ఇది అక్కినేని అభిమానులకు గుడ్ న్యూసే.

తాత, తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ అందంగా తయారయ్యాడు అఖిల్. గత రెండు సినిమాలతో పోలిస్తే చాలా ట్రెండీగా కనిపిస్తున్నాడు. హెయిర్ స్టయిల్ కూడా మార్చేశాడు. ఫస్ట్ లుక్ వీడియోలో భాగంగా ఓ డైలాగ్ కూడా పెట్టారు. ఆ డైలాగ్ వింటుంటే.. అమ్మాయిల్ని పడేసే హైటెక్ కుర్రాడిలా అఖిల్ కనిపిస్తున్నాడనే విషయం అర్థమౌతూనే ఉంది. వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. త్వరలోనే సినిమా విడుదల తేదీని ప్రకటించబోతున్నారు.

First Published:  19 Sep 2018 8:38 AM GMT
Next Story